30 మంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు #BeHuman సమావేశానికి హాజరుకానున్నారు

30 మంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు #BeHuman సమావేశానికి హాజరుకానున్నారు

 మానవ సౌభ్రాతృత్వంపై రెండవ ప్రపంచ సమావేశం, #BeHuman పేరుతో, మే 10-11 తేదీలలో రోమ్ లో జరగనున్నది.  ఫ్రాటెల్లి టుట్టి ఫౌండేషన్ వారు దీనిని నిర్వహిస్తున్నారు. దాదాపు 30 మంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలుఈ కార్యక్రమం లో   పాల్గొంటారు.

మే 10-11 తేదీలలో జరిగే ఈ సమావేశంలో 12 నేపథ్య రౌండ్‌టేబుల్‌ సమావేశాలు ఉంటాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు మన సమకాలీన ప్రపంచంలోని  ముఖ్యమైన సమస్యలపై మాట్లాడనున్నారు.

హోలీ సీ స్టేట్ సెక్రటరీ, కార్డినల్ మహా పూజ్య పియట్రో పరోలిన్ గారు  మే 10, శుక్రవారం ఉదయం పాలాజ్జో డెల్లా క్యాన్సెల్లెరియాలో  "శాంతిపై రౌండ్ టేబుల్" (Roundtable on Peace)సమావేశం "ని ప్రారంభించనున్నారు. ఈ  కార్యక్రమమే లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళలు, పురుషులు మరియు వివిధ సహాయ సంస్థలు, అలాగే మానవ హక్కుల కార్యకర్తలు కూడా పాల్గొంటారు.

శనివారం మధ్యాహ్నం మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు పిల్లల కొరకు జరగనున్న  "ఫ్యూచర్ జనరేషన్" (Children: Future Generation)అనే రౌండ్ టేబుల్‌ సమావేశం లో పాల్గొననున్నారు. ఈ సమావేశం మే 25-26 తేదీల్లో జరిగే మొదటి ప్రపంచ బాలల దినోత్సవానికి  సన్నాహకంగా ఉంటుంది.

ఇతర సమావేశాలు  సహకారం, సుస్థిరత మరియు వ్యాపారం, వ్యవసాయం, విద్య, క్రీడలు, ఆరోగ్యం, ఉపాధి, పరిపాలన, సోషల్ మీడియా మరియు సమాచారం మీద జరగనున్నాయి.
రౌండ్‌టేబుల్స్‌లో మాట్లాడేవారిలో ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్, ఇటాలియన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్ లూసియానో స్పాలెట్టీ, ఫియట్ ఆలివర్ ఫ్రాంకోయిస్ CEO మరియు వర్చువల్ ఎకానమీ బ్యాంకర్ విక్టర్ అమ్మర్ , ఇతరులు ఉన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer