కడప పీఠం-చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

ఫిబ్రవరి 26,2024 న సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు కడప మేత్రాసనంలోని MPSSS నందు గురుశ్రీ జంపంగి సుధాకర్ గారి సారథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెరసాల పరిచర్య సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన, గురుశ్రీ టి బాలరాజు గారి ఆధ్వర్యంలో  చెరసాల పరిచర్య మేత్రాసన వార్షిక సమావేశం జరిగింది.

మేత్రాసన చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలతో ముఖాముఖీ సందర్శించి ఈ సమావేశంలో వారి అనుభవాలను, అమూల్యమైన సూచనలను సలహాలను సేకరించారు.

ఈ సమావేశంలో స్వచ్చంద కార్యకర్తలకు చెరసాల పరిచర్యలో తాము మరిన్ని సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ మరియు శ్రీసభ ప్రోత్సాహాన్ని కోరారు.

చెరసాల నుండి పెరోల్ పై /జామీను ద్వారా విడుదలైన ఖైదీలను ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కలిపించామని, చెరసాల బయట ఉన్న  ఖైదీల కుటుంబాలకు సహాయాన్ని అందించామని, వారి పిల్లల చదువుకు సహాయం చేసారని, ఇంకా చేస్తామని గురుశ్రీ పసల లహస్త్రాయ గారు తెలిపారు.

ఈ సమావేశంలో గురుశ్రీ జనార్దన్ గారు కూడా పాల్గొన్నారు 

పరిశుద్ధ పోపు గారి 2025 జూబిలీ సంవత్సర సందర్బంగా  మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య చెరసాల పరిచర్య విభాగ అధ్యక్షులు కార్డినల్ మహా పూజ్య అంతోని పూల గారి ఆదేశాల మేరకు చెరసాల పరిచర్య సమావేశాలు జరుగుతున్నాయని RVA తెలుగు విభాగానికి తెలియచేసారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలకు, గురువులకు, స్వచ్చంద కార్యకర్తలకు చెరసాల పరిచర్య మీత్రసన కోఆర్డినేటర్ గురుశ్రీ జంపంగి సుధాకర్ గారు కృతజ్ఞతలు తెలియచేసారు.

Tags