ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణానికి జరిగే హానిని గుర్తించి,  ప్రజలు తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకత గురించి ఇది తెలియజేస్తుంది.

ఈ భూమి మన అందరిది, ఇందులో మనతో పాటు సమస్త ప్రాణకోటి జీవించేందుకు అర్హత కలిగి ఉంది. కానీ, నేడు అభివృద్ధి పేరుతో పచ్చని అడవులు నశించిపోతున్నాయి, అరుదైన జీవజాతులు కనుమరుగై పోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి. మనం తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల... అన్ని  కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.  మొత్తం మీద జీవసమతుల్యత దెబ్బతింటోంది.  పచ్చదనంతో కలకలలాడాల్సిన భూతల్లి.. ప్రకృతి అందాలను కోల్పోయి మౌన రోదనతో కన్నీరు కార్చుతోంది. 

 ప్లాస్టిక్ వాడకం, నేలపైన చెత్తచెదారలు, నదులు కలుషితం చేయడం, అడవులు నరికివేయడం వంటివి అన్నీ మనిషి తెలిసి చేస్తున్న తప్పిదాలే. ఈరోజు ఉష్నోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయంటే, నీరు లేక జనం అల్లాడుతున్నారంటే అందుకు కారణం స్వయంకృతపరాధమే.