FABC అధ్యక్షులుగా భారతీయ కార్డినల్ ఎన్నిక

ఫిబ్రవరి 22న బ్యాంకాక్‌లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సమావేశంలో గోవా మరియు డామావో అగ్రపీఠాధిపతులు భారతీయ కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఆంటోనియో సెబాస్టియో డో రోజారియో ఫెర్రో అధ్యక్షులుగా మరియు ఫిలిఫైన్స్,కలూకాన్  పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో విర్జిలియో సియోంగ్‌కో డేవిడ్‌ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

జపాన్‌లోని టోక్యోకు చెందిన డివైన్ వర్డ్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య టార్సిసియో ఇసావో కికుచి గారు సెక్రటరీ జనరల్‌గా రెండోసారి పదవీ బాధ్యతలు చేప్పట్టనున్నారు.

ఈ మూడు పదవీకాలాలు జనవరి 2025లో ప్రారంభమవుతాయి.

గోవా మరియు డామావోకు అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఫెర్రావ్ గారు కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI, లాటిన్ రైట్)కి కూడా అధ్యక్షులు. 

ఫ్రాన్సిస్ పొప్ గారు ఆగస్ట్ 27, 2022న ఫెర్రోను గారిని కార్డినల్‌గా ఎన్నిక చేయబడ్డారు.

FABC ప్రెసిడెంట్‌గా ఉన్న సలేసియన్ కార్డినల్ చార్లెస్ బో తర్వాత ఫెర్రో గారు బాధ్యతలు స్వీకరిస్తారు. కార్డినల్ చార్లెస్ బో గారు మయన్మార్‌లోని యాంగో అగ్రపీఠాధిపతులు.

ఫిలిఫైన్స్,కలూకాన్  పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో విర్జిలియో సియోంగ్‌కో డేవిడ్‌ గారు ఫిలిప్పీన్స్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP)కి అధ్యక్షులు.

FABC అనేది దక్షిణ, ఆగ్నేయ, తూర్పు మరియు మధ్య ఆసియాలోని కాథలిక్ ఎపిస్కోపల్ సమావేశాల స్వచ్ఛంద సంఘం, ఇది 1970లో స్తాపింపబడింది 

అక్టోబర్ 2022లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్ అగ్రపీఠ పాస్టరల్ ట్రైనింగ్ సెంటర్ అయిన బాన్ ఫు వాన్‌లో దాని ఫాబిక్ 50వ సంవత్సరాన్ని జరుపుకుంది.

Tags