సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ అవశేషాల ప్రదర్శనకు సిద్ధం కావాలి : కార్డినల్ ఫిలిప్ నెరి గారు

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ అవశేషాల ప్రదర్శనకు సిద్ధం కావాలి : కార్డినల్ ఫిలిప్ నెరి గారు  

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ (పునీత ఫ్రాన్సిస్ శౌరీవారు) అవశేషాల ప్రదర్శన కోసం గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య  ఫిలిప్ నెరి ఫెర్రో గారు అవశేషాల ప్రదర్శనకు మరియు  ఆధ్యాత్మిక సన్నాహాలను ప్రారంభించాల్సిందిగా కోరారు.

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (St Francis Xavier)యొక్క పవిత్ర అవశేషాల ప్రదర్శన నవంబర్ 21, 2024న ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇది జనవరి 5, 2025 వరకు కొనసాగుతుంది. పాత గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్‌(The Basilica of Bom Jesus, Old Goa)లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ అవశేషాల ప్రదర్శన జరుగుతుంది.  అధిక సంఖ్యలో స్వదేశీ మరియు విదేశీ పర్యాటకులు సందర్శిస్తారు.  

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, జెస్యూట్, స్పెయిన్‌లోని జేవియర్ పట్టణంలో జన్మించారు. అతను స్పానిష్ కాథలిక్ మిషనరీ మరియు సొసైటీ ఆఫ్ జీసస్‌ను సహ- స్థాపన చేసిన పునీతులు. అతను భారతదేశం, మలయ్ ద్వీపసమూహం మరియు జపాన్‌లో క్రైస్తవ మతాన్ని స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

పునీత ఫ్రాన్సిస్ శౌరీవారు తన జీవితాన్ని సంపూర్ణముగా, హృదయపూర్వకముగా, దేవునికి, తన ప్రజలకు అర్పించారు. ఎక్కడకు వెళ్ళిన, పేదరికములో జీవించారు. చాల మితముగా భోజనం చేసెడివారు. ఎక్కువగా, పేదలతో, పనివారితో గడిపేవారు. అనారోగ్యులకు సేవలు చేసెడివారు. రాత్రంతయు ప్రార్ధనలో గడిపేవారు. పునీత ఫ్రాన్సిస్ శౌరివారు ఎన్నో అద్భుతాలను చేసారు.

ఫ్రాన్సిస్ జేవియర్, డిసెంబర్ 3, 1552న చైనాలోని సాన్సియాన్ (ఇప్పుడు షాంగ్‌చువాన్) ద్వీపంలో మరణించారు. అక్టోబరు 25, 1619న, పోప్ పాల్ V అతన్ని బీటిఫై చేశారు. మార్చి 12, 1622న, పోప్ గ్రెగొరీ XV అతన్ని కాననైజ్ చేశారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer