సినడ్ జాతీయ సమావేశం

"సినడాలిటీ- అట్టడుగు వర్గాల గళం"  పై రెండు రోజుల జాతీయ సమావేశం ఫిబ్రవరి 16-17 తేదీలలో బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించబడింది.

ఈ సమావేశాన్ని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI), షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల విభాగం మరియు తమిళనాడు బిషప్స్ కౌన్సిల్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమిషన్ (SC/ST TNBC కమిషన్) సంయుక్తంగా సమన్వయం చేశాయి.

కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వారు 2016 దళిత సాధికారత విధానం వెలుగులో, కుల పద్ధతులను తప్పనిసరి చేసింది.

కార్డినల్ అంతోని పూల, తన ప్రసంగంలో" దివ్యారాజ్యా నిర్మాణం కోసం సినడల్ చర్చి యొక్క ద్రుష్టి ప్రేషితకార్యం, సహవాసము మరియు భాగస్వామ్యం" అని అన్నారు.

ఈ ప్రక్రియలో ఎవరూ వెనుకబడకుండా కాథలిక్ చర్చి అందరినీ కలుపుకుని పోవాలని, ముఖ్యంగా అణగారిన వర్గాల వాణిని వినిపించి చర్చిలో పాల్గొనాలని అన్నారు.

CBCI SC/BC విభాగం అధ్యక్షులు మహా పూజ్య శరత్ చంద్ర నాయక్ మరియు మాజీ అధ్యక్షులు మహా పూజ్య నీతినాథన్ ఆంథోనిసామి, సినడాలిటీ భావనను పునరుద్ధరించడానికి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

తమిళంలో దళిత సాధికారత విధానం అనువాదం రెండవ ఎడిషన్‌ను విడుదల చేశారు.