యేసు తిరుహృదయ దేవాలయంలో మ్రానికొమ్మల ఆదివారం

మానవ రక్షణ చరిత్రలో మ్రానికొమ్మల ఆదివారం ముఖ్య ఘట్టమని హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగుడ, యేసు తిరుహృదయ దేవాలయం నందు మార్చి 24 2024, ఉదయం 8 గంటలకు  గురుశ్రీ  కుందూరు జోజి గారు మరియు విచారణ సహాయక  గురువు  గురుశ్రీ ప్రభాకర్ గారు   మ్రానికొమ్మలను ఆశీర్వదించి విశ్వాసులకు అందజేశారు. 

విచారణ కర్తలు గురుశ్రీ ఎమ్ జ్వానేస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పవిత్రసాంగ్యములో విశ్వాసులంతా తాటి మట్టలను చేబూని దేవాలయము చుట్టూ సంప్రదాయ ప్రదక్షిణ నిర్వహించారు. "హోసాన్నా స్వామికి సతతం" అంటూ విశ్వాసులు ఆనందోత్సాహాల మధ్య ఆలపించిన గీతాలతో దేవాలయ ఆవరణ ఆధ్యాత్మికానందం సంతరించుకుంది. 

మానవ రక్షణ చరిత్రలో యెరుషలేములో క్రీస్తు ప్రవేశించిన దగ్గర నుంచి మరణ, పునరుత్థానాల వరకు గల ఘట్టం కీలకమైనదని వివరించారు.  పవిత్రవారంలో ప్రవేశించామని అందరూ భక్తిశ్రద్ధలతో ఈ వారమంతా ప్రభుధ్యానంలో ఎక్కువ సమయం గడపడానికి యత్నించాలన్నారు ఫాదర్ జోజి గారు.

Tags