మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు

మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు
మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు

మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు

విశాఖ అతిమేత్రాసనము,సాలిగ్రామపురం, లూర్దుమాత దేవాలయాలం లో పండుగ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సా॥ 5.30 గం॥లకు పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.  

లూర్దుమాత మహోత్సవము ఫిబ్రవరి 11, 2024  న జరగనున్నది. ఈ సంవత్సరం లూర్దుమాత దేవాలయ రజత జూబిలీ(1999-2024) సంవత్సరము. నవదిన ప్రార్థనలో భాగం గా ప్రతిరోజు సా|| 6.00 గం॥లకు జపమాల, దివ్యబలి పూజ, నవదిన ప్రార్థనలు జరుగును.
పండుగ రోజు అనగా  తేది 11-02-2024 ఆదివారం నాడు 4.30 గం॥లకు జపమాల, సా॥ 5.00 గ॥లకు పుర ప్రదక్షిణ, సా॥ 6.00 ని॥ లకు దివ్యబలిపూజ జరగనున్నది .    విశాఖ అగ్రపీఠాధిపతులు  మహా పూజ్య డా. మల్లవరపు ప్రకాశ్ గారి చే సమిష్టి దివ్యబలిపూజ జరగనున్నది. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్, ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ దుగ్గింపూడి బాలశౌరి గారు , విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జ్ఞాన్ ప్రకాశ్ గారు , విశాఖ అర్బన్ డీన్ గురుశ్రీ సరిసా ప్రతాప్ గారు మరియు ఇతర గురువులు ఈ దివ్యబలిపూజ లో పాల్గొంటున్నారు.  
గురుశ్రీ ఎస్ విజయ్ భాస్కర్ మరియు  గురుశ్రీ ఏ శ్రీధర్ గారు విశ్వాసులను  ప్రేమతో ఆహ్వానిస్తున్నరు.

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer