మిడిల్ ఈస్ట్‌లో హింసాకాండను అరికట్టాలి : ఫ్రాన్సీస్ జగద్గురువులు

మిడిల్ ఈస్ట్‌లో హింసాకాండను అరికట్టాలి :  ఫ్రాన్సీస్ జగద్గురువులు

ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న  హమాస్ చేసిన భీకర దాడులు, వీటికి ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ప్రపంచం విలవిలలాడుతోంది.  ఇజ్రాయెల్ దాడులతో గాజా  . ఈ ఆరు నెలల యుద్ధం కారణంగా రోగాలు, పస్తులు, చావులతో గాజాలోని పాలస్తీనియన్ల జీవితం ధ్వంసమైంది.

ఆదివారం ప్రార్థనల సమయంలో పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు గారు మాట్లాడుతూ "మిడిల్ ఈస్ట్‌లో హింసాకాండను అరికట్టాలని మరియు గాజాలో యుద్ధం కారణంగా  బాధపడుతున్న వారికి సహాయం చేస్తూనే అన్ని దేశాలు శాంతి కొరకు ప్రయత్నించాలని  హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఆందోళన మరియు బాధ కలుగుతుందని  ఫ్రాన్సీస్ జగద్గురువులు చెప్పారు. ఈ సందర్భముగా గాజాలో కాల్పుల విరమణ కోసం తన విజ్ఞప్తిని మరోసారి నొక్కి  చెప్పారు .

ప్రపంచంలో యుద్ధాల కారణంగా బాధపడుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల కోసం ప్రత్యేక  ప్రార్థనలను చేసారు. ప్రత్యేకించి యుద్ధం వలన బాధపడుతున్న ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, మయన్మార్ ప్రజల కొరకు గురించి ప్రస్తావించారు.

అయితే సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్‌కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు మరణించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు చేసిన ఇరాన్, శనివారం ఇజ్రాయేల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ప్రయోగించింది.  

ఇజ్రాయెల్‌లోని ‘‘నిర్ధిష్ట లక్ష్యాలే’’ కేంద్రంగా తాజా దాడులు చేసినట్లుగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చెప్పింది

ఈ ఘర్షణలో కనీసం 9 దేశాలు పాలుపంచుకుంటున్నాయి. ఇరాక్, సిరియా, యెమెన్ దేశాల నుంచి ఇరాన్ రాకెట్లను ప్రయోగిస్తుండగా, అమెరికా, బ్రిటన్, జోర్డాన్, ఫ్రాన్స్‌లతో కలిసి ఇజ్రాయెల్ ఈ మిసైళ్లను అడ్డుకుంది.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer