ప్రార్థన సమావేశానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది

ప్రార్థన సమావేశానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది

చెన్నై నగరంలో ఉన్న డా.పాల్ దినకరన్ గారు, దేశవ్యాప్తంగా ప్రార్ధన సమావేశాలను నిర్వహించే ప్రసిద్ధ సువార్తికులు.

భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఏప్రిల్ 10న డా. పాల్ దినకరన్ గారి ప్రార్థన సభ జరగనుండగా, ఏప్రిల్ 6న అఖిల భారత హిందూ మహాసభ (అఖిల భారత హిందూ మహా మండలి) ఆధ్వర్యంలోని కార్యకర్తలు మత మార్పిడి కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కార్యక్రమానికి అనుమతిని రద్దు చేయాలని ఇండోర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనితో జిల్లా అధికారులు ప్రార్థన సమావేశ అనుమతిని రద్దు చేశారు.

ప్రార్థన సమావేశ ప్రోగ్రాం యొక్క చీఫ్ ఆర్గనైజర్ సురేష్ కార్లెటన్ గారు "యూనియన్ అఫ్ కాథలిక్ ఆసియన్ న్యూస్" తో మాట్లాడుతూ "మేము ఏప్రిల్ 10 న ప్రోగ్రామ్‌ను షెడ్యూల్ చేసాము, కానీ అదే రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, కాబట్టి మేము దానిని రద్దు చేయాల్సి వచ్చింది" చెప్పారు.

ఏప్రిల్ 10న నిర్వహించాల్సిన ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించడానికి మార్చి 22న జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది అని , ఏప్రిల్ 6 ఫిర్యాదు తర్వాత అనుమతిని రద్దు చేసారని తెలిపారు. స్టే ఆర్డర్‌ను కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించినా తిరస్కరించింది అని, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

"సుప్రీంకోర్టు ఏకపక్ష ఉత్తర్వులను నిలిపివేసి, మాకు న్యాయం చేసినందుకు మేము సంతోషిస్తున్నాము" అని సురేష్ కార్లెటన్ గారు తెలిపారు.

జస్టిస్ బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కలెక్టర్‌ను ప్రార్థనా సమావేశంలో ప్రసంగించడానికి యేసు పిలుచుచున్నాడు (JESUS CALLS) మినిస్ట్రీకి అధిపతిగా ఉన్న సువార్తికుడు డా.పాల్ దినకరన్‌ గారిని అనుమతించాలని కోరింది.

ఇండోర్‌లో జరిగే సమావేశానికి వివిధ వర్గాలకు చెందిన దాదాపు 8,000 మంది క్రైస్తవులు హాజరవుతారని కార్లెటన్ చెప్పారు. ఈ ప్రార్థన సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అయన తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer