నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు గురువారం, ఫిబ్రవరి 22, 2024న పునీత పేతురు బోధన సింహాసనోత్సవం రోజున ఫిలిప్పీన్స్‌, బికోల్ ప్రాంతంలోని కాసెరెస్‌ నూతన అగ్రపీఠాధిపతిగా గురుశ్రీ రెక్స్ ఆండ్రూ అలార్కాన్ గారిని నియమించారు.

అలార్కాన్ కాసెరెస్ గారు తాను పుట్టిన మేత్రాసనానికే అగ్రపీఠాధిపతి అవ్వడం సంతోషకరమైన విషయం.

ఫిలిప్పీన్స్‌లో అతి పిన్న వయసులో పీఠాధిపతిగా (2019లో) నియమితులు అయ్యారు 

మనీలాలోని సంపలోక్‌కు చెందిన  మహా పూజ్య రోలాండో ఆక్టావస్ ట్రియా టిరోనా 77 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ తీసుకున్న తరువాత ప్రస్తుతం డాయెట్ పీఠాధిపతిగా అలార్కాన్ గారు సేవలందిస్తున్నారు. టిరోనా గారు నవంబర్ 2012 నుండి అగ్రపీఠాధిపతిగా తన సేవను అందించారు.

అలార్కాన్ గారు ఆగష్టు 6, 1970న కామరైన్స్ నోర్టే యొక్క ప్రావిన్షియల్ రాజధాని డాట్‌లో జన్మించారు.

నాగాలోని హోలీ రోసరీ మైనర్ సెమినరీలో తన హైస్కూల్ విద్య మరియు తత్వశాస్త్ర కోర్సులను పూర్తి చేసిన తర్వాత, మనీలాలోని శాంటో టోమస్ విశ్వవిద్యాలయం (యుఎస్‌టి) సెంట్రల్ సెమినరీలో వేదాంతశాస్త్రాన్ని అభ్యసించారని ఫిలిప్పీన్స్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP) న్యూస్ తెలిపింది.

నవంబర్ 9, 1996న, UST యొక్క వర్సిటేరియన్ ప్రచురణ ప్రకారం, అలార్కాన్ కాసెరెస్‌ అగ్రపీఠ గురువు అయ్యారు 

తను నాగా సిటీలోని సెయింట్ జాన్ ది ఎవాంజెలిస్ట్ విచారణ సహాయక గురువుగా వ్యవహరించారు. దాదాపు మూడు సంవత్సరాల అతను అప్పటి అగ్రపీఠాధిపతి లియోనార్డో లెగాస్పికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేసారు.

నాగా పారోచియల్ స్కూల్ మరియు కాసెరెస్ అగ్రపీఠ ఎవాంజెలైజేషన్ కమీషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

తను 2001లో రోమ్‌లోని పోంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయం నుండి చర్చి చరిత్రలో లైసెన్సీయేట్ పొందారు.

జనవరి 2, 2019 న, పోప్ అతన్ని డాట్ పీఠాధిపతిగా నియమించారు. ఆ సంవత్సరం మార్చి 19న పీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు.

అలార్కాన్ గారు ప్రస్తుతం CBCP ఎపిస్కోపల్ కమిషన్ ఫర్ యూత్ అధ్యక్షునిగా ఉన్నారు.

Tags