ఘనం గా కొండడాబాలు వ్యాకులమాత మహోత్సవం

ఘనం గా కొండడాబాలు వ్యాకులమాత మహోత్సవం
ఘనం గా కొండడాబాలు వ్యాకులమాత మహోత్సవం

ఘనం గా కొండడాబాలు వ్యాకులమాత మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరాంధ్రలో ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొత్తవలస మండలం కొండడాబా వ్యాకులమాత పండుగ ఘనంగా జరిగింది. గురుశ్రీ  గొంగాడ రాజు గారి ఆధ్వర్యంలో కొండపై గడిచిన తొమ్మిది రోజులుగా  నిర్వహిస్తున్న నవదిన ప్రార్థన లు శనివారం రాత్రి ముగిశాయి.

 ఈ పండుగకు కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక, రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ, ఒరిస్సా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాల నుంచి క్రైస్తవ విశ్వాసులు,  యాత్రికలు యాత్ర ముందు రోజు శనివారం వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ముందు రోజుఫిబ్రవరి 3వ తేదీన శనివారం విశాఖపట్నం జ్ఞానాపురం నుంచి "పాప పశ్చాత్తాప మహా పాదయాత్ర" భక్తిశ్రద్ధలతో జరిగింది. 4వ తేదీన ఆదివారం పండుగ రోజు  ఉదయం 4 గంటల నుంచి 7గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు, దివ్య పూజబలిలు జరిగాయి.  విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జ్ఞాన్ ప్రకాశ్ గారి  ఆధ్వర్యంలో ఇతర గురువులతో కలసి పండుగ దివ్య పూజబలిని  సమర్పించారు.

ఈ పండుగలో అధిక సంఖ్యలో వివిధ మేత్రాసనాలనుండి గురువులు , సిస్టర్స్ పాల్గొన్నారు. శ్రీకాకుళ మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చల్ల డేవిడ్ గారు పండుగలో పాల్గొని భక్తులకొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.

అధిక సంఖ్యలో భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు . భక్తులు తలనీలాలు సమర్పించారు. 33అడుగులు ఎత్తైన క్రీస్తు గొర్రెల కాపరి స్వరూపం  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధ్యాహ్నం 2.30.గంటలకు కొండపైకి వ్యాకులమాత స్వరూపంతో మహా ప్రదర్శన జరిగింది.

ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, యాత్రికలు వేలాదిగా తరలి వచ్చిన వారికి వసతి, ఇతర సౌకర్యాలు, కొండడాబా ప్రాంగణంలో చేసారు. శనివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం యాత్రకు వచ్చే యాత్రికలు కోసం కొత్తవలస నుంచి కొండపైకి రావడానికి ఎస్‌.కోట, విశాఖపట్నం ఆర్‌టిసి డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు.

ఈ ఆలయానికి 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏటా ఫిబ్రవరి మొదటి ఆదివారం నిర్వహించే ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళ
నాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు . ఈ చర్చిలో 1914వ సంవ త్సరంలో పారిస్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించిన వ్యాకులమాత ప్రతిమను కులమతాలకు అతీతంగా ఆరాధించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ స్వరూపం  కొండపైకి వెళ్లే మార్గంలో ప్రతిష్టించారు.  ఈ స్వరూపం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తల్లి మరియమ్మ ఒడిలో సిలువ వేసి క్రిందకు దించిన ఏసు క్రీస్తు వారి ప్రతిరూపంగా దర్శినమిస్తుంది. యాత్రికలు కొండపైకి ఎక్కుతూ  స్వరూపం వద్దకు వెళ్లి ప్రార్దించి తమ మొక్కులు తీరుతాయని చెబుతారు.

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer