ఘనంగా పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవం

ఘనంగా పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవం

విశాఖ అగ్రపీఠం మధురవాడ విచారణ లో గల  పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ మహోత్సవం  ఘనంగా జరిగింది.
పండుగరోజు ఉదయం 7 గంటల  ఇంగ్లీష్ దివ్యబలిపూజ ను గురుశ్రీ జితేష్, T.O.R. గారు సమర్పించారు. అధికసంఖ్యలో విశ్వాసులు , గురువులు, మఠకన్యలు, సలహా సంఘ పెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

సాయంత్రం 4.30  గంటలకు పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారి "తేరు ఊరేగింపు" కార్యక్రమం ఘనంగా జరిగింది.
అనంతరం సాయంత్రం5:30 ని॥లకు సమిష్టి కృతజ్ఞతా దివ్యబలిపూజని  గురుశ్రీ వర్గీస్, T.O.R. గారు మరియు విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ యుగళ్ కుమార్ గార్లు ఇతర గురువులతో కలసి సమర్పించారు.

గురుశ్రీ యుగళ్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ  పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారు "సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును ఎలా అనుసరించారో ప్రజలకు  వివరించారు.

ఈ కార్యక్రమంలో గురుశ్రీ మరియారత్నం  గారు , గురుశ్రీ సరిస ప్రతాప్ గారు, గురుశ్రీ బి.  జోసెఫ్  గారు, గురుశ్రీ  ఇతర గురువులు పాల్గొన్నారు.
అధికసంఖ్యలో విశ్వాసులు, సిస్టర్స్, యువతీ యువకులు పాల్గొన్నారు. విచారణ  గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.విచారణ సహాయక గురువులు ఎప్పటిలాగానే తన సహాయ సహకారాలను అందించారు.
విచారణ గురువులు గురుశ్రీ  ప్రకాష్ గారు పూజానంతరం ప్రజలందరికి  అందరికి ప్రేమ విందు ని ఏర్పాటు చేసారు.
గురుశ్రీ  ప్రకాష్ గారు ప్రజలకు  'పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.