ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో యుద్ధాన్ని ఆపమని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో యుద్ధాన్ని ఆపమని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు

 ఆదివారం,  ఏంజెలస్ వద్ద  ప్రార్థనల  తర్వాత  ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో దాడులను వెంటనే ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు.

దయచేసి దాడులును ఆపండి. తీవ్రవాదం మరియు యుద్ధం ఎటువంటి పరిష్కారానికి దారితీయవని, చాలా మంది అమాయకుల మరణాలకు మరియు బాధలకు మాత్రమే కారణం అవుతున్నాయని  అర్థం చేసుకోండి" అని పోప్ ఫ్రాన్సిస్ గారు విజ్ఞప్తి చేశారు.

శనివారం నాడు  ఇజ్రాయెల్ లక్ష్యంగా వందల కొద్దీ రాకెట్లను హమాస్ ఉగ్రవాదులు  ప్రయోగించారు. మునుపెన్నడూలేని రీతిలో ఆ దాడి జరిగింది. గాజా నుంచి రాకెట్ల దాడి మొదలైన కొద్దిసేపటికే ఈ ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ సాయుధులు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. హమాస్‌ను బ్రిటన్ సహా అనేక దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాయి.

జెరూసలెం నుంచి జోర్డానియన్ బోర్డర్ వరకూ ఉన్న వెస్ట్‌ బ్యాంక్‌పై నియంత్రణ కోసం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం కొనసాగుతోంది. 1967 నుంచి ఇజ్రాయెల్ ఆధీనంలో  ఉన్న ఈ ప్రాంతం గురించే ఏడాది పొడవునా ఇరువర్గాల మధ్య నిరంతరం ఘర్షణలు, హింస చెలరేగుతున్నాయి.