ఎడారి దేశంలో వరదలు

ఎడారి దేశంలో వరదలు

 దుబాయ్‌లో సోమవారం అర్థరాత్రి  నుండి భారీ వర్షాలు కురిసాయి.ఈ వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. అల్-అయిన్ నగరంలో తాజాగా కేవలం 24 గంటల్లోనే దాదాపు 256 మి.మీ వర్షపాతం కురిసింది.  హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. ప్రధాన రహదారులు మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలు మునిగిపోయాయి.
దుబాయ్ విమానాశ్రయానికి వచ్చే విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ రికార్డు స్థాయి వర్షపాతం వాతావరణం మార్పులను ప్రతిబింబిస్తోంది.

రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా వీధులన్నీ చెరువులను తలపించాయి. వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. షాపింగ్ మాల్స్‌లో మోకాలిలోతు వరకూ నీరు చేసింది.

దుబయ్ వాతావరణం సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది. దుబయ్‌లో ఏడాదికి సగటున 100 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. మంగళవారం సాయంత్రానికి దుబాయ్‌లో 120 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గాలిలోని అధిక తేమ తుపానులను సృష్టిస్తుంది. కుంభవృష్టి కురవడం, ఫలితంగా భారీ వరదలు సంభవిస్తాయి.

క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం వల్ల ఇలా జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు.   క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ అసాధారణ వర్షపాతం సంభవించిందనే వాదనలను స్థానిక అధికారులు కొట్టిపారేశారు.

భూగోళం వేడెక్కుతుండటం, అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనుచున్నది. భూమండలంపై శిలాజ ఇంధనాల అతి వినియోగం, కార్బన్ డై ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలు రోజు రోజుకూ పెరుగుతుండటం వల్ల కలిగే భూతాపం మానవాళికి పెనుశాపంగా మారుతోంది.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer