నా సూపర్ హీరోలు తాతలు, అవ్వలు - పోప్ ఫ్రాన్సిస్

సూపర్ హీరోలు
పోప్ ఫ్రాన్సిస్

జూలై నెలలో ఎటువంటి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయనప్పటికీ, ఫ్రాన్సిస్ పాపు గారు "ఎస్టేట్ రాగాజీ ఇన్ వాటికానో" అను పేరుతో ప్రారంభమైన వేసవి శిబిరం లోని పిల్లలను సందర్శించారు. ఆ పిల్లలు ఆయనకు పాటలతో స్వాగతం పలికారు.

కొంతమంది చిన్నారులు పాపు గారికి బహుమతులు కూడా ఇచ్చారు 

సమావేశంలో, పాపు గారు తన సూపర్ హీరోలు ఎవరనే దానితో సహా పిల్లలు తనను అడిగిన విభిన్న ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరియు పోప్ ఒక ప్రత్యేకమైన సమాధానంతో స్పందించారు.

"నా ఆలోచనను మీరందరూ పంచుకుంటారో లేదో నాకు తెలియదు. నా సూపర్ హీరోలు ఎవరో తెలుసా? తాతలు, అవ్వలు. ఎందుకంటే వారు ఒక కుటుంబాన్ని నిర్మించారు మరియు వారు 
పెద్దవారయ్యారు. కానీ వారు తెలివైనవారు. అందుకే మీరందరూ వారితో మాట్లాడటం చాలా ముఖ్యం" అని ఆయన పిల్లతో అన్నారు.

2021లో ఫ్రాన్సిస్ పాపు గారు ప్రారంభించిన ప్రపంచ తాత, అవ్వల మరియు వృద్ధుల దినోత్సవానికి కేవలం 5 రోజుల ముందు ఈ సందేశం వస్తుంది.

క్యాంపర్‌లను వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేయాలని మరియు డిజిటల్ ప్రపంచంతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ప్రోత్సహించారు.