కృత్రిమ మేధస్సు (AI) వల్ల కలిగే ప్రమాదాల గురించి పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు

కృత్రిమ మేధస్సు (AI) వల్ల కలిగే ప్రమాదాల గురించి పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు

57వ ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు  తన వార్షిక సందేశంలో భాగంగా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ముడిపడి ఉన్న ప్రమాదాల గురించి మనమందరం ఆలోచించాలని కోరారు. ప్రపంచ శాంతిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ప్రభావాన్ని తెలియజేస్తూ , దాని అభివృద్ధి మరియు వినియోగాన్ని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందాన్ని అందరు  పాటించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
వాటికన్ ఈ సందేశాన్ని చాలా ముందుగానే విడుదల చేసింది, ఇది ఆచారంగా కూడా  ఉంది.   86 ఏళ్ల వయస్సులో ఉన్న ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ గారు గతంలో తనకు కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదని ఈ సందర్భముగా అన్నారు.

పోప్ ఫ్రాన్సిస్ "కృత్రిమ మేధస్సు యొక్క ఆయుధీకరణ" గురించి ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు, ప్రత్యేకించి లెథల్ అటానమస్ వెపన్ సిస్టమ్స్ (LAWS) ఉదహరిస్తూ, అధునాతన ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే జరిగే  ప్రమాదం గురించి హెచ్చరించారు.

"వ్యవసాయం, విద్య మరియు వివిధ పద్దతులలో ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం మరియు  మానవ అభివృద్ధిని ప్రోత్సహించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించవచ్చని పోప్ ఫ్రాన్సిస్ గారు పేర్కొన్నారు. ఈ  కృత్రిమ మేధస్సు వినియోగంలో యువతకు అవగాహన  కల్పించాలని కోరారు