కామం పట్ల జాగ్రత్త వహించండి, స్వచ్ఛమైన ప్రేమను స్వీకరించండి పొప్ ఫ్రాన్సిస్

కామం పట్ల జాగ్రత్త వహించండి,  స్వచ్ఛమైన ప్రేమను స్వీకరించండి పొప్ ఫ్రాన్సిస్

వాటికన్ సిటీలో మహా పూజ్య  పోప్ ప్రాన్సిస్ గారు బుధవారం నాడు జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో మాట్లాడుతూ " పోర్నోగ్రపీ" ప్రమాదం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.  శృగారం దేవుడిచ్చిన వరమని, కానీ అది చివరకు పోర్నోగ్రపీ కారణంగా అణచివేతను ఎదుర్కొంటోందని అన్నారు.

ప్రేమలో పడటం చాలా అందమైన మరియు సున్నితమైన అనుభవాలలో ఒకటి అని ఈ సందర్భముగా చెప్పారు. అది దుర్గుణాలచే కలుషితం కాకపోతే, ప్రేమలో పడటం అనేది స్వచ్ఛమైన భావాలలో ఒకటి అని అన్నారు .If it is not polluted by vice, falling in love is one of the purest feelings.”

"ప్రేమలో ఉన్న వ్యక్తిని వారు ఎందుకు ప్రేమిస్తున్నారని మీరు అడిగితే, వారు సమాధానం చెప్పలేరు అని, వారి ప్రేమ బేషరతుగా, కారణానికి మించి ఉంటుంది" అని పొప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు. ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన ప్రేమ యొక్క అందం మొత్తాన్నిఈ పోర్నోగ్రపీ అపహాస్యం చేస్తుంది అని అన్నారు.

పోర్న్ క్రూరమైన ప్రవర్తనలకు దారితీస్తుంది అని .. కామం ప్రమాదకరమై పరిణామాలకు దారితీస్తుంది’ అని పోప్ ఫ్రాన్సిస్ గారు హెచ్చరించారు. కామం ప్రజల మధ్య సంబంధాలను కూడా  నాశనం చేస్తుంది అని హెచ్చరించారు.  ప్రస్తుత కాలంలో డిజిటల్ పోర్నోగ్రఫీ వల్ల చిన్న పెద్ద అని తేడాలేకుండా బానిసలుతున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదు అని  పోప్ ప్రాన్సిస్ గారు అన్నారు.

 

Article By
M Kranthi Swaroop
RVA Telugu Online Producer