క్రైస్తవ సమస్యలపై వినతి పత్రం సమర్పించిన కర్నూలు క్రైస్తవ ఐక్యవేదిక

కర్నూలు క్రైస్తవ ఐక్యవేదిక
క్రైస్తవ సమస్యలపై వినతి పత్రం

కర్నూలు క్రైస్తవ సమాజము మరియు క్రైస్తవ ఐక్యవేదిక కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం ఆధ్వర్యంలో ప్రభుత్వ క్రైస్తవ సలహాదారుడు గురుశ్రీ మధు బాలస్వామి గారితో క్రైస్తవ నాయకుల సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో క్రైస్తవ ప్రతినిధులు పాల్గొని క్రైస్తవ సమస్యలను వినతి రూపంలో తెలియజేయడమైనది అందులో ఒకటి BC-C క్రైస్తవుల స్వరం చట్టసభలలో వినిపించడానికి క్రైస్తవులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు నామినేటెడ్ పోస్టులను కేటాయించి అల్ప సంఖ్యాక మైనార్టీ క్రైస్తవులకు న్యాయం చేయవలసినదిగా కోరడమైనది. క్రైస్తవ సమాధుల తోట విషయంలో ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి క్రైస్తవుల సమాధుల తోట కేటాయించవలసినదిగా కోరడమైనది మూడవదిగా క్రైస్తవ పాఠశాలలు అన్యాక్రాంతం కాకుండా వాటిని అభివృద్ధిపరిచి విస్తరించవలసినదిగా కోరడమైనది. ఇందు విషయమై మైనారిటీ కళాశాలకు సంబంధించిన వారు పాల్గొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పలు సంఘాలనుంచి వచ్చిన ప్రతినిధులు పలురకాల వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఫాదర్ మధు బాలస్వామి గారు అక్కడికక్కడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కొన్ని వినతులను పరిష్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ హక్కుల పోరాట నాయకుడు జాషువా డానియల్ క్రైస్తవ ఐక్యవేదిక జనరల్ సెక్రెటరీ జెట్టి ప్రభుదాస్ గారు క్రైస్తవ సంక్షేమ సంఘం సునీల్ గారు సృజన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సాల్మన్ రాజుగారు బ్రేకు తృ  మినిస్ట్రీస్ బ్రదర్ జాన్ గారు వైఎస్ఆర్సిపి నాయకులు ఏలియా గారు ఆళ్లగడ్డ ప్రభాకర్ గారు మరియు ఫాదర్ చౌరప్ప గారు పాల్గొన్నారు.