క్రీస్తు జయంతి సంతోషాన్నిపేదలతో పంచుకున్న పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ

ఫిలిప్పీన్స్, బటాంగాస్ ప్రావిన్స్‌, నసుగ్బు పట్టణంలోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ సామాజిక సేవల సభ్యులు డిసెంబర్ 29 నుండి 31, 2023 వరకు "ఆహార పొట్లాలను" సుమారు 300 కుటుంబాలకు పంపిణీ చేశారు.

ఈ సంవత్సరం క్రీస్తు జయంతి సందర్బంగా విచారణ విశ్వాసులు తమకు తోచినంత సహాయం అవసరాలలో ఉన్న వారితో పంచుకున్నారని,  విచారణ కార్యదర్శి రోసాలీ దస్తాస్ గారు అన్నారు.

మోన్సిగ్నోర్ సిసిలియో ఆర్స్, విచారణ గురువులు గురుశ్రీ జాన్సెన్ గువేరా మరియు గురుశ్రీ బ్లాడిమిర్ కలింగసన్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

ప్రతి ఏటా డిసెంబర్ 15 నుండి 24 వరకు జరిగే దివ్యబలిపూజలలో ఈ కార్యక్రమం గురించి  విజ్ఞప్తులు ప్రకటింపబడతాయి.

“290 కుటుంబాలకు సహాయం అందించిన వారికి ధన్యవాదాలు" అని దస్తాస్ అన్నారు.

బారంగే చాపెల్ కోఆర్డినేటర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.విచారణ సామాజిక సేవా సభ్యులు 29 గ్రామాల్లోని 300 కుటుంబాలకు పంపిణీని ఏర్పాటు చేసినట్లు దస్తాస్ తెలిపారు.

"వచ్చే సంవత్సరం మరింత మంది వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాము, ఇంకా ఎక్కువ మంది భాగస్వామ్యులు అవ్వాలని, తద్వారా మేము అవసరమైన మరిన్ని కుటుంబాలకు సహాయం చేస్తాము" అని అన్నారు.