"యువకులారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి"

youth
జాతీయ యువజన ఆదివారం వేడుకలు

"యువకులారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి"

అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా దేవాలయం, ఫాతిమానగర్, వరంగల్ గురుపీఠంలో ఫాతిమా యువత అసోసియేషన్ సభ్యులు జాతీయ యువజన ఆదివారం వేడుకలు నిర్వహించారు.

బిషప్ హౌస్ నుండి అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా దేవాలయం వరకు పీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారిని స్వాగతించడం మరియు స్వాగత నృత్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఉదయం 7:30 గంటలకు వరంగల్ మేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ అనుకిరణ్, 
 గురుశ్రీ కాసు మర్రెడ్డి విచారణ గురువు గురుశ్రీ .ఎం.ప్రవీణ్‌తో కలిసి వరంగల్ పీఠాధిపతులు,  ఖమ్మం అపోస్టోలిక పాలనాధికారి అయిన మహా పూజ్య ఉడుమల బాల గారు దివ్యబలిపూజను సమర్పించారు.

ఫాతిమా యూత్ అసోసియేషన్ ఏర్పడిన దశాబ్ధ సంవత్సరాన్ని పురస్కరించుకుని, గత 10 సంవత్సరాల నుండి చురుగ్గా పనిచేస్తున్న కొంతమంది యువజన సభ్యులైన సాగర్ గబ్బెటా, అనిల్ మేకల, లోహిత్ తుమల, అవినాష్ గుండే మరియు ప్రమోద్ గాదె లను పీఠాధిపతులు సత్కరించారు, ఆపై ఫాతిమా యూత్ సభ్యులు పీఠాధిపతి  సత్కరించారు.