"పిల్లలు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతులు "- గురుశ్రీ అండ్రూ

"పిల్లలు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతులు "- గురుశ్రీ అండ్రూ

సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు చిన్న పిల్లలకు ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది. ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలో1 నుండి 3 వ తరగతి పిల్లలు పాల్గొన్నారు. సుమారు పాతిక మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.  

విద్యార్థులంతా వారికీ నచ్చిన వివిధ రకాల పిల్లల కార్టూన్  క్యారెక్టర్  వేషధారణతో ఈ పోటీలో పాల్గొని చూపరులను ఆకట్టుకున్నారు. ప్రధానంగా ట్వైలైట్  స్పార్కుల్, డొరొమోన్,డోరా,మాష,చోట బీమ్ వేషధారణలో చిన్నారులు అలరించారు.
ఈ కార్యక్రమం లో పునీత పాట్రిక్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గురుశ్రీ ఎలాంగో గారు , స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గురుశ్రీ ఆండ్రూ గారు మరియు  స్కూల్ కరెస్పాండంట్ ఆయన గురుశ్రీ రవి శేఖర్  గారు  పాల్గొన్నారు.

పునీత పాట్రిక్స్ స్కూల్ కల్చరల్ క్లబ్ ఇంఛార్జ్ టీచర్ శ్రీమతి  రోస్ మేరీ గారి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.     ఈ సందర్భముగా ఫాదర్ అండ్రూ గారు మాట్లాడుతూ "పిల్లలు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతులు అని. వారి అందమైన బాల్యం ఆహ్లాదంగా, ఆనందంగా కొనసాగడానికి తమ వంతు సహకారాన్ని పాఠశాల నుండి అందిస్తున్నాము అని తెలిపారు.

పాఠశాల ఉపాధ్యాయులు  బాలబాలికల్లో దాగిఉన్న శక్తిని వెలికి తీసి వారిని ప్రోత్సహిస్తున్నారు  అని, పిల్లలు చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందేలా చూడాలని  టీచర్ శ్రీమతి  రోస్ మేరీ గారు  తల్లిదండ్రులకు  విజ్ఞప్తి చేశారు.పిల్లలందరూ ఉత్సాహంగా  ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. టీచర్స్ తో పాటు  పిల్లల తల్లిదండ్రులు ఆనందంగా గడిపారు.