Importance of 40 days in Christian Life

క్రైస్తవ జీవితంలో 40 రోజులకు గల ప్రాముఖ్యత

 

పరిశుద్ధ గ్రంధం లో 40 రోజులకు, 40 సంవత్సరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పరిశుద్ధ గ్రంధంలో 40 అను సంఖ్య పదే పదే ప్రస్తావించబడింది. పాత నిబంధనలో మరియు నూతన నిబంధనలో 40 రోజులను పవిత్రమైన దినాలుగా గుర్తించారు.

పరిశుద్ధ గ్రంధంలో 40 రోజుల ప్రాముఖ్యత:

1 . నోవా కాలంలో 40 రోజులు భూమి అంతటా జల ప్రళయం సంభవించడం (ఆది 7 : 17 )
2 . మోషే సీనాయి కొండ మీద 40 పగళ్లు 40 రాత్రులు గడుపుట (నిర్గమ 24 : 18 )
3 . గూఢచారులు 40 రోజుల తర్వాత మోషే వద్దకు సమాచారం మోసుకొని వచ్చుట ( సంఖ్య 13 : 25 )
4 . గొల్యాతు ఇస్రాయేలీయులను 40 రోజులు రూపుమాపులు కవ్వించినారు ( 1 సమూ 17 : 16 )
5 . ఏలీయా ప్రవక్త 40 రోజులు ప్రయాణించి హోరేబు కొండను చేరాడు ( 1 రాజు 19 : 8 )
6 . యావే ప్రభువు ఎహెఙ్కేలు ప్రవక్తతో 40 రోజులు యూదా వారి పాపములను భరించునని సూచించుట ( ఎహె 4 : 6 )
7 . యోనా ప్రవక్త 40 రోజులకు నీనెవె పట్టణం నాశనమగునని ప్రకటించెను ( యోనా 3 : 4 )
8 . యేసు 40 రోజులు ఉపవాస ప్రార్ధన చేయుట మరియు సాతాను చేత ఎడారిలో శోధింపబడుట ( మార్కు 1 : 13 )
9 . ఉత్తాన క్రీస్తు శిష్యులకు 40 రోజులు దర్శనమిచ్చెను (అకా 1 : 3 )
10 . తిరుసభ 40 రోజులు తపస్కాలముగా ఆచరించును 

 

రండి !!! 
ఈ 40 రోజులు దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవిద్దాం...

Add new comment

12 + 8 =