శ్రీసభలో "కార్డినల్" యొక్క ప్రాముఖ్యత 

ప్రాముఖ్యత కార్డినల్

కార్డినల్ అంటే పవిత్ర తండ్రికి సహాయకుడు. వారు వివిధ స్థాయిలలో శ్రీసభలో అనుసంధాన ప్రక్రియ చేస్తారు. అందుకే కార్డినల్ అనే పదం లాటిన్ పదం "కార్డో" నుండి ఉద్భవించింది.  "కార్డో" అంటే "కీలు" అని అర్ధము. ముఖ్యంగా శ్రీసభ పరిపాలన కార్యక్రమాలలో వీరు అనుసంధాన కర్తలుగా వ్యహరిస్తారు.

కథోలిక శ్రీసభలో కార్డినల్ లో మూడు భాగాలు ఉన్నాయి: కార్డినల్ పీఠాధిపతులు , కార్డినల్ గురువులు మరియు కార్డినల్ డీకన్‌లు. కార్డినల్స్ యొక్క అతి ముఖ్యమైన క్రమం కార్డినల్ పీఠాధిపతులు. 

ఒక సారి కార్డినల్ గా నియమింపబడితే వారు జీవితాంతం కార్డినల్ గానే కొనసాగుతారు. 

కార్డినల్స్‌ను కన్సిస్టరీ అని పిలిచే ప్రత్యేక సమావేశం ద్వారా ఎంపిక చేస్తారు. ఒక కార్డినల్ రోమ్‌లోని పాపల్ క్యూరియాలో లేదా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్న మేత్రాసనాలు మరియు అతిమేత్రాసనాల స్థాయిలలో పనిచేస్తారు.

ఈ కార్డినల్స్ అందరు ఒక సంఘంగా ఉంటారు. వారిలో కొందరికి పాపు గారిని ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుంది. 

Add new comment

8 + 8 =