యేసు తిరు హృదయ మహోత్సవ శుభాకాంక్షలు | June 24 2022

17వ శతాబ్దంలో మార్గరీత మరియమ్మ అనే కన్యకకు యేసు మూడుసార్లు ప్రత్యక్షమై తిరుహృదయం తాలుకు భక్తిభావాన్ని విశదీకరించారు. 

ఫ్రాన్సు దేశంలోని పరిమోనియాల్ అనే పట్నంలో ఈ కన్యక ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూచింది. 

అగ్నిజ్వాలలలో మండుచున్న యేసుని హృదయం, దాని చుట్టూ ఒక ముండ్ల కిరీటం, దానిపై ఒక సిలువ చూచింది. 

ఆ దృశ్యంలో యేసు తన హృదయం వైపు చూపిస్తూ తన హృదయభక్తిని వ్యాపకం చేయమని ఆదేశించారు. 

ఫలితంగా 1765వ సంవత్సరంలో 13వ క్లెమెంట్ పోపుగారు ఈ పండుగను అన్నిమేత్రాసనాల్లో జరుపుకోవాలని అనుమతించారు. 

ఆ తర్వాత 9వ భక్తినాథ పోపుగారు యావత్తు శ్రీసభ గొప్పగా జరుపుకోవాలని 1856, ఆగష్టు 23వ తేదీన తమ అధికారపత్రం ద్వారా ఆదేశించారు. 

ఆపైన 13వ సింహరాయలు పోపుగారు 1889 ఈ సంవత్సరంలో ఈ పండుగను ప్రథమస్థాయికి చెందిన పండుగగా నియమిస్తూ తమ విశ్వలేఖ ద్వారా యావత్తు శ్రీసభను తిరుహృదయానికి అంకితం చేసారు

Add new comment

10 + 7 =