యేసు తిరుహృదయ దేవాలయము నందు మొదటి దివ్యసత్ప్రసాద స్వీకరణ

హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగుడా, యేసు తిరు హృదయ దేవాలయము నందు సెప్టెంబర్
నెల 19 ఆదివారం విచారణ బాలబాలికల దివ్యసత్ప్రసాద స్వీకరించడం జరిగింది 

కార్డినల్, హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య.పూల అంతోని తండ్రిగారు, ఇతర గురువులు కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

లాలాగుడా విచారణ నుండి 43 మంది భద్రమైన అభ్యంగము మరియు నూతన దివ్య సత్ప్రసాదమును స్వీకరించారని విచారణ కర్తలు గురుశ్రీ మెట్టు జానేస్ రెడ్డి గారు తెలిపారు.

విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను లాటిన్ , హిందీ, తమిళం మరియు ఆంగ్లంలో ఆలపించారు.

విచారణ గురువులు గురుశ్రీ జానేస్ గారు మేత్రాణులకు, విచ్చేసిన గురువులకు, సత్యోపదేశ బోధకులకు, విశ్వాసులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
 

Add new comment

10 + 2 =