మరియమాత పూజిత మాసం - దేవమాత పేరును గూర్చి 

దేవమాత పేరును గూర్చి 

దేవమాత యొక్క " మరియ"  అను పేరు మహిమగల నామము 
"మరియ" అన్నది మధురమైన నామము.
"మరియ"  అనే పేరు మిక్కిలి బలము గల నామము.

1 .  "మరియ"  అనే పేరు కంటే గొప్ప పేరు ఇంకొకటి లేదనియే చెప్ప వలెను. అది మిక్కిలి మహిమగల పేరు "మరియ" అనగా ఏలినరాలు, నాయకి,  అని  అర్ధములు ఉన్నవి. "మరియ" అను పేరు స్వర్గలోకంలో మహా గౌరవ మహిమలు పొందుతున్నది.  అందుచేత మరియమ్మ గారు స్వర్గలోక వాసులకు ఏలినరాలు గానూ ఇహలోక వాసులకు రాణి గానూ భావింప బడుచున్నది  

రాజులు సైతం వారి దేశమును, దేశ ప్రజలను దేవమాత శరణుకు అర్పించి ఉన్నారు. అందుచేత పరలోక భూలోకములందు  "మరియ" అను నామము స్తుతింపబడునుచున్నది. భూలోకవాసులకు మరియమ్మ గారు రాణిగా నుండి మన ప్రజల యొక్క హృదయమును మంచి మార్గంలో నడిపించి మన కష్టములందు ఆదరించి మన బలహీనతలలో మనకు బలముగా నుండి మరణ భయమందు మనకు నమ్మికగా  ఉన్నారు. 

2. "మరియ" అను మూడు అక్షరాల పేరు మిక్కిలి మధురము ఆనందము. "మరియ" అను ఈ  పూజనీయ నామమును నమస్కరించి ప్రేమించెడి వారు మిక్కిలి భాగ్యవంతులై  సకల సత్క్రియలయందు, పుణ్యములందు వర్ధిల్లుదురు అని పునీత బొనవెంతురు అనువారు చెప్పియున్నారు.  ఆ "మరియ" నామమును జపించెడి వారికి ఊరట కలుగును. "మరియ" నామము విన్నచో పిచాచి గడగడలాడును కావున పిచాచి శోధనలకు మనము గురైనప్పుడు మరియమాతను భక్తి తో వేడినచో పిచాచి మన చెంతకు రాదు మరియమాత భక్తి తో జపించు వారికీ పిచాచి రాక దూరంగా పారిపోవును.

3. "మరియ" అను నామము మిక్కిలి జ్ఞానబలముగలది ఘోర తుఫాను వంటి ఈ జీవిత సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న మనకు మరియ నామము శాంతిని కాంతిని ప్రసాదించును. "మరియ" అను పేరు వెలుగుతున్న దీపం వంటిది. మోక్షమార్గము వెదకు వారికి "మరియ" అను నామము మార్గచూపరిగా ఉన్నది ప్రళయకాల సముద్రుని బోలిన ఈ లోకంలో పాపమై  భరించు మనకు మరియమాత నామము శరణ్యమని రక్షణ మార్గచుపరియై ప్రకాశించుచు ముక్తిమార్గమునకు  దారి చూపించు చున్నది. మన ఆత్మనాశ్రయించు అహం, కోపం, మోహం, అసూయ వంటి దుర్గుణములనుండి రక్షింపుమని మరియమాత నామమును ప్రార్ధింతము. మన ఆపదాలయందును, లేమియందును, నిర్భాగ్యములందును మరియమాత శరణు వేడుదుము. ఆమె పూజ్యమగు పేరు మన పెదవులనుండి హృదయము వరకు నిత్యా స్మరణ చేసెదముగాక. మరియమాతను వేడువారెవ్వరును దారి తప్పరు. తప్పినను రుజుమార్గమును తెలుసుకొందురు అని పునీత బెర్నార్డ్ గారు వ్రాసియున్నారు.

 

Article and Voice by

Arvind Bandi

Online Producer

Add new comment

5 + 0 =