మంగళవార్త మహోత్సవము

సత్యోపదేశం లో ఉన్నట్లుగా దివ్యసత్ప్రసాదాన్ని శరీర ఆయుత్తం అనగా ఆత్మ చావైనా పాపం లేక ఉండాలి. శరీర ఆయుత్తం అనగా దివ్యసత్ప్రసాదం స్వీకరించడానికి ముందు ఉండాలి. ఒక వ్యక్తి తనలో క్రీస్తు ప్రభువును ఆహ్వానించడానికి ఇంతగా శుద్ధి పాటిస్తే , మరి ఆ ప్రభువునే తన గర్భములో నవమాసాలు మోసే భాగ్యాన్ని పొందిన మరియా తల్లి ఇంకెంత పవిత్రంగా ఉందొ అనేది ఊహకు అందని విషయం. అలాంటి పవిత్రుల కొరకు సాక్షాత్తు తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశారంటే, ఆమె దేవుని దృష్టిలో ఎంత ఉన్నతమైనవారో అని మనం తెలుసుకోవాలి. అందుకే దేవున్ని ముఖాముఖిగా దర్శించి స్తుతించే గాబ్రియేలు దూత , ఆమెతో " అనుగ్రహ పరిపుర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు" అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది, ఆ శుభ వచనము ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము.

ఆయన మహనీయుడై ,మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా, యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ,"నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీ పై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును. ని చుట్టమగు ఎలిజబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్లినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరియించి ఇది ఆరవ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు  దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక!" అనెను. అంతటా గాబ్రియేలు దూత వెళ్లిపోయెను.

దూత పలుకులు విని మరియతల్లి తన విశ్వాసాన్ని ధృడ పరచుకుందేకాని ,అవిశ్వాసాన్ని కనబరచలేదు. అనగా దేవిని తల్లిగా ఉంటె ఎన్నో కష్టాలను, బాధలను ఎదురుకోవలసి వస్తుంది. పురుషున్ని కలవక మునుపే గర్భం ధరిస్తే సమాజంలో చంపబడతాను అని తానూ ఏనాడు వెనకడుగు వేయక విశ్వాస బాటలోనే  నడిచింది. మనం కూడా క్రీస్తునియందు మరియతల్లి లాంటి  స్వభావాన్ని పొందటానికి ఆ తల్లి అనుగ్రహం మనపై మన కుటుంబాలపై వచ్చునట్లు ప్రార్దించుదాం.

 
 

Add new comment

8 + 1 =