పునీత పౌలు గారి హృదయ పరివర్తన మహోత్సవము

పునీత పౌలు గారి హృదయ పరివర్తన మహోత్సవము 

 

ఈ రోజు పునీత పౌలు గారి హృదయ పరివర్తన మహోత్సవాన్ని కాథోలిక శ్రీసభ కొనియాడుతుంది. 

పునీత పౌలు గారు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి హృదయ పరివర్తన చెందక ముందు ఆయన పేరు సౌలు.

ఈయన రోమా సామ్రాజ్యములో తార్సు నగరంలో జన్మించారు. ఆయన ఒక యూదుడు. రోమా సామ్రాజ్యములో పుట్టుట వలన ఆయన రోమా పౌరసత్వము కలిగి ఉన్నాడు. ఆయన తన 5 వ ఏటనుండే ధర్మ శాస్త్రమును అభ్యసించుట ప్రారంభించాడు. క్రైస్తవులు యూదుల సిద్దాంతమునకు వ్యతిరేకులని తలంచిన సౌలు, క్రైస్తవులని హింసించే వాడు. 

దమస్కు లో క్రైస్తవుల సంఖ్యా విస్తరించుచున్నదని విన్న సౌలు, ప్రధానయాజకుల వద్ద అనుమతిని పొంది, దమస్కులో ఉన్న క్రైస్తవులను బంధించడానికి దమస్కు నగరానికి ప్రయాణమయ్యాడు సౌలు.

కానీ దమస్కు లోనికి ప్రవేశించక ముందే అతనికి ఒక గొప్ప వెలుగు ప్రకాశించి అతనిని తన గుఱ్ఱమునుండి క్రిందకి పడదోసింది.

అప్పుడు సౌలు ఆ వెలుగు ఎవరని ప్రశ్నించగా క్రీస్తు ప్రభువు ఆ వెలుగు నుండి "నీవు హింసించుచున్న యేసును నేనే అని పలికారు.

వెంటనే సౌలు మారు మనసు పొంది క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. ఆ క్షణం నుండి ఆయన పౌలు గా పిలువ బడ్డాడు.

అపోస్తలుల యుగములో ప్రముఖుడుగా పరిగణించబడియున్న పౌలు క్రీస్తు సువార్తను మొదటి శతాబ్దములో విరివిగా ప్రకటించి, ఆసియా ఐరోపాలలో అనేక క్రైస్తవ సంఘములను స్థాపించాడు. యూదునిగా, రోమా పౌరసత్వము కలిగి ఉండుట అను విశిష్ట అర్హతలను ఆధారము చేసుకొని యూదులు, రోమా పౌరుల మధ్యలో విస్తృతమైన పరిచర్య చేసాడు. 

 

బైబిల్ లోని  నూతన నిబంధనలోని 27 పుస్తకములలో 13 పుస్తకములు పౌలు గారిచే వ్రాయబడినవి

Add new comment

1 + 0 =