ఉపవాసం చేయాలా ? బైబిలు ఏమి చెప్తుంది?

ఉపవాసం చేయాలా ?  బైబిలు ఏమి చెప్తుంది?
ఆనాటి కాలంలో చాలామంది  ఉపవాస ప్రార్థనలు చేయడం చూసాము . మంచి ఉద్దేశంతో  చేసినటువంటి ఉపవాసం లను దేవుడు అంగీకరించాడు.  అయితే, మనకాలంలోని ప్రజలు ఉపవాసం ఉండాలనిగానీ, అలా ఉండకపోతే అది తప్పనిగానీ బైబిలు చెప్పట్లేదు.

  • మొదటిగా మన యేసు ప్రభువు చేయనటువంటి  ఉపవాసం చూసినట్లయితే ,బాప్తిస్మం తర్వాత, యేసుప్రభువు తాను చేయబోయే పరిచర్య అంతటిలో తండ్రి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేలా తనను తాను సిద్ధం చేసుకోవడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు.​(లూకా 4:​1, 2).
  • యెరూషలేముకు ప్రయాణిస్తున్న ప్రజలు వాళ్ళు వెళ్లే మార్గములో కాపాడుటకు , దేవుని సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ,దేవుని యందు వినయము చూపించడానికి , ఉపవాసం ఉన్నారు. (ఎజ్రా 8:​21-23) .
  • పౌలు, బర్నబాలు సంఘంలో పెద్దల్ని నియమించేటప్పుడు వారు విశ్వసించి ,  ఉపవాసం తో ప్రార్ధించి ప్రభువునకు అప్పగించే వారు .​(అపొస్తలుల కార్యాలు 14:23).
  • దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.”​—యోవేలు 2:​12-15.
  • దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినాన ఉపవాసం ఉండాలనే ఆజ్ఞ ఉంది.  (లేవీయకాండము 16:​29-31)

 

క్రైస్తవులు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందా?

ప్రాయశ్చిత్త దినాన ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ  యేసు ప్రభువు  మనందరికోసం పాపపరిహారం గా బలియేన తర్వాత , ఇశ్రాయేలీయుల కాలంలోని ఆ ఆచారాన్ని దేవుడు రద్దు చేశాడు. (హెబ్రీయులు 9:​24-26; 1 పేతురు 3:18) ప్రాయశ్చిత్త దినం మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది, కానీ క్రైస్తవులు ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం కింద లేరు. (రోమీయులు 10:4; కొలొస్సయులు 2:​13, 14) అందుకే ఉపవాసం ఉండాలా, వద్దా అని ప్రతీ క్రైస్తవుడు సొంతగా నిర్ణయించుకోవాలి.​—రోమీయులు 14:​1-4.

యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే క్రైస్తవుల్లో ఎవరైనా ఆకలిగా ఉంటే ఇంటి దగ్గరే తిని రమ్మని బైబిలు చెప్తుంది.​—1 కొరింథీయులు 11:​33, 34.

 

 

 

 

Add new comment

2 + 4 =