Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
We miss you father | Fr Raymond ambrose INSPIRING WORDS
తమను తాము మించి ఆలోచించి, తరువాతి తరానికి కోసం ఆలోచించేంత తెలివైనవారు కాబట్టి మేము వారిని మహానుభావులు అని పిలుస్తాము.
వివిధ అంటరానివారి జీవితంలో వారికి ఆనందాన్ని, జీవితపు ఆశను ,ఆకలితో ఉన్నవారికి ఆదరించే ఇచ్చే గొప్ప శక్తి ,మనస్సు దేవుడు వారికీ ఇచ్చారు. అందరికి ఆదర్శంగా,యువతకు మార్గదర్శకంగా చాలామంది ఉన్నారు, అలాంటి మంచి వ్యక్తులలో రేవ్ ఫాదర్ రేమండ్ అంబ్రోస్ ఒకరు.
పాండిచేరి డియోసెస్లో జన్మించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో తనను తాను గురువుగా స్థాపించుకోవడానికి, తన సొంత భాష, సంస్కృతికి మించి పనిచేయడానికి ప్రేరణ పొందారు. most rev బిషప్ జువాన్ అంబ్రోస్ సోదరుడు Fr.రేమండ్ అంబ్రోస్.
అమృతవాణి సహ వ్యవస్థాపకుడు, జీవన్ ప్రెస్ వ్యవస్థాపకుడు, హోమ్ ఫర్ ది డిసేబుల్డ్ మరియు ఎపిఎస్ఎస్ఎస్(apsss) ఇంచార్జి గా ఫాదర్ గారు ఉన్నారు ."కరుణామయుడు" సినిమా అయన హయాంలోనే అమృతవాణి చే నిర్మించబడినది. సికింద్రాబాద్ లోని అతను మానసిక రోగులకు, పెంపుడు పిల్లలు అని పిలువబడే, మరియు వృద్ధాప్యంలో అనాథలకు ఒక ఇంటిని స్థాపించాడు. సేవాశ్రమంలో 400 మంది పిల్లలను చూసుకోవడంతో పాటు వందలాది కుటుంబాలు కు ,విద్యార్థులకు అయన ఎంతో సహాయం చేసారు.
సాధుశీలి, స్నేహజీవ అయిన గురు శ్రీ రేమండ్ అంబ్రోస్ గారు నేడు, అనగా 7 జులై 2020 తెల్లవారు జామున గుండె పోటు తో హైదరాబాద్ లో మృతి చెందారువీరి అకాల మరణానికి చింతిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరిథాస్ వారు అర్పిస్తున్న అశృనివాళి.ఫాదర్ గారి ఆత్మా కు శాంతి కలగాలని కోరుకుంటూ ...మనమందరము ఆ దేవాది దేవుని ప్రార్దించుదాము.
Add new comment