Claretian Youth To Listen and Walk with Jesus |

"వాక్ విత్ జీసస్ "

 క్లరేషియన్ ( Claretian) యూత్ మరియు వొకేషన్ మినిస్ట్రీ బెంగుళూరు వారు నిర్వహించిన  "వాక్ విత్ జీసస్ " మూడు రోజుల (7,8,9 October )కార్యక్రమము ఘనముగా ముగిసినది .7వ తేదీ ఉదయం  జ్యోతి  ప్రజ్వలన తో మొదలైన ఈ కార్యక్రమము ,మొదటిగా   తెలుగులో దివ్య బలిపూజ జరిగినది .వివిధ ప్రాంతాలనుండి  వచినటువంటి  క్లరేషియన్ యువతీ ,యువకుల తో   తెనాలి ప్రాంతమంతా సందడిగా మారింది .సుమారు 250  క్లరేషియన్ యువతీ ,యువకుల పాల్గొన్నారు. రేవ్. ఫాదర్  టోమీ జోసెఫ్( The organise) ఆద్వర్యం లో  జరిగినటువంటి ఈ కార్యక్రమానికి  రేవ్ . ఫాదర్  జాకబ్ ( the Provincial of Bangalore), రేవ్ .ఫాదర్  చిన్నాన్న  (Andhra and Telangana youth co ordinator ) సహా సుమారు 20 మంది  క్లరేషియన్  ఫాదర్ లు పాల్గొనడం జరిగినది .
ముఖ్య అతిధి ఐనటువంటి రేవ్. ఫాదర్ విలియం  డిసౌజా   ( Karnataka) బెంగుళూరు ఇచ్చినటువంటి  సందేశం యువతీ యువకులను ఎంతగానో ఆకట్టుకున్నది  .రేవ్. ఫాదర్ విలియం  డిసౌజా తో పాటూ వచ్చిన రెజినా, టోనీ  జేసురాజ్
సిస్టర్ మదురై  యూత్ వారి కొరకు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు (Best leadership, Games, Dances, Blind walk etc ) నిర్వహించారు . యువతీ యువకులు ఉత్సాహముగా పాల్గొన్నారు. హిందుస్తానీ  క్లాప్  తో  ఫాదర్  చిన్నాన్న  యూత్  ని  ఆకర్షించారు .సిస్టర్" సెల్ఫ్ సెన్స్ " కొరకు దృశ్య రూపంలో  ఏర్పాటుచేసిన వీడియో అందరిని ఆకట్టుకుంది .ఫాదర్  విలియం  ఇచ్చిన  బ్లైండ్  వాక్ (Blind Walk) మెసేజ్  విని యువతీ యువకులు  దానిని  ప్రాక్టికల్  రూపంలో  బ్లైండ్  వాక్  చేసారు .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంతి మాట్లడుతూ "ఈ  కార్యక్రమం ప్రతి ఒక్కరి  ఆధ్యాత్మక జీవితానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపింది ". అలాగే రాజా మాట్లాడుతూ "యవ్వనకాలములో  ప్రభు మార్గములో నడవాలని తెలుసుకున్నానని తెలిపారు  .

 క్లరేషియన్ సభ గురువులు ఇచ్చిన ప్రోత్సాహం ,ఆతిధ్యం ,కనబరిచిన దైవ ప్రేమ అభినందనీయం .

 

Add new comment

1 + 12 =