CCBI నందు గురుశ్రీ రేమండ్ జోసఫ్ గారికి వీడ్కోలు కార్యక్రమం

బెంగుళూరు,CCBI జనరల్ సెక్రటేరియట్‌లో ఆగస్టు 3,2022 బుధవారం రోజున  దైవపిలుపుల, గురువులు, దైవాంకితుల విభాగ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ రేమండ్ జోసెఫ్ గారికి వీడ్కోలు పలికారు.

వరంగల్ మేత్రానులు, సి సి బి ఐ దైవపిలుపుల, గురువులు, దైవాంకితుల విభాగ అధ్యక్షులైన మహా పూజ్య ఉడుమల బాల గారు శాలువతో మరియు పునీత జోజప్ప గారి స్వరూపాన్ని బహుమతిగా ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. 

సి సి బి ఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ డాక్టర్ స్టీఫెన్ అలతార గారు, గురుశ్రీ రేమండ్ గారు అందించిన గణనీయమైన సేవలకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతనంగా నియమితులైనసి సి బి ఐ దైవపిలుపుల, గురువులు, దైవాంకితుల విభాగ కార్యనిర్వహక కార్యదర్శి -  గురుశ్రీ చార్ల్స్ లియోన్ గారిని మరియు శ్రీసభ చట్టం మరియు శాసనాల సి సి బి ఐ విభాగా కార్యనిర్వహక కార్యదర్శి గురుశ్రీ మెర్లిన్ రెనెజిత్ ఆంబ్రోస్‌ గారిని ఘనంగా స్వాగతించారు.

సిసిబిఐ కేంద్రంలో, మహా పూజ్య ఉడుమల బాల గారు ముఖ్య అతిథిగా కృతజ్ఞతలు తెలుపుతూ దివ్యబలిపూజను సమర్పించారు. గురుశ్రీ చార్ల్స్ లియోన్ మరియు గురుశ్రీ మెర్లిన్ రెనెజిత్ ఆంబ్రోస్‌ గార్లు బాధ్యతలు స్వీకరించారు.

వీడ్కోలు సమావేశంలో కర్ణాటక, పీఠాధిపతుల కౌన్సిల్ సెక్రటరీ మరియు బెంగుళూరు అగ్రపీఠ వికార్ జనరల్, Msgr. యస్ జయనాథన్ గారు, బెంగుళూరు- అసోసియేషన్ ఆఫ్ రెక్టార్స్ ఆఫ్ మేజర్ సెమినరీస్ (ARMS) మరియు సెయింట్ పీటర్స్ సెమినరీ రెక్టార్ గురుశ్రీ రిచర్డ్ బ్రిట్టోగారు, సిసిబిఐ సువార్త ప్రబోధ సేవ విభాగ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మరియు పొంటిఫికల్ మిషన్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ - గురుశ్రీ .డా. ఆంబ్రోస్ పిచ్చైముత్తు గారు సిసిబిఐ పరిశుద్ధ గ్రంథ సేవా విభాగ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ డా.యేసు కరుణానిధి మరియు కమ్యూనియో అసోసియేట్ డైరెక్టర్ గురుశ్రీ విజ్ఞాన్ దాస్ గారు  గురుశ్రీ రేమండ్ జోసెఫ్ గారిని సన్మానించారు.

Add new comment

1 + 2 =