73rd Independence Day | India

ఆగస్టు 15. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న గొప్పరోజు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఎంతోమంది మహామహుల జీవితాల త్యాగ ఫలితంగా భారతదేశం స్వాతంత్య్రం సాధించుకుంది. తద్వారా 1947 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15న దేశం మొత్తం సగర్వంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకల సందర్భంగా దేశ ఘనతను, మహామహులు చేసిన సేవల్ని స్మరించుకుందాం. వారు రగిలించిన స్ఫూర్తితో మరింత ముందుకు సాగుదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Add new comment

5 + 14 =