60 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైన పిపిసి కార్యాలయం 

సెయింట్ జోసెఫ్ విచారణ  ఇంఫాల్పిపిసి కార్యాలయం

సుగ్ను వద్ద ఉన్న సెయింట్ జోసెఫ్ విచారణ  ఇంఫాల్, మణిపూర్ అగ్రపీఠంలో 60 సంవత్సరాల తర్వాత పిపిసి కార్యాలయాన్ని పునఃప్రారంభించారు.

పిపిసి కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విచారణ గురువు అయిన ఫాదర్ విక్టర్ అరులప్పన్  
గారు చొరవ తీసుకున్నారు.

ఇది భగవంతుని సేవలో లౌకిక సాధికారతలో భాగమని ఆయన తెలిపారు.

విచారణ గురువు యొక్క చొరవను సుగ్నూలోని క్యాథలిక్ సంఘం ప్రశంసించింది.

సుగ్ను వద్ద ఉన్న సెయింట్ జోసెఫ్ పారిష్ ఇంఫాల్, మణిపూర్ అగ్రపీఠంలోని పురాతన కాథలిక్ చర్చిలలో సుగ్ను వద్ద ఉన్న సెయింట్ జోసెఫ్ విచారణ ఒకటి. 

ప్రస్తుత విచారణ గురువులు గురుశ్రీ విక్టర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ మరియా నుబావి నేతృత్వంలో విచారణలో మరియు సెయింట్ జోసెఫ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఎన్నో మంచి  మౌలిక మార్పులు మరియు అభివృద్ధి జరిగాయని వక్తలు కొనియాడారు.

ఈ సందర్భంగా హాజరైన గ్రామస్తులు మాట్లాడుతూ విచారణ గురువు చేపట్టే అన్ని కార్యక్రమాలలో  తమ మద్దతు, సహకారము ఉంటాయని తెలిపారు.

అన్నా నెంగ్, పా బోస్కో పాయోసి, బెథానీ లోకల్ చర్చి, పారిష్ ఉమెన్స్ సొసైటీ, క్రైస్ట్ ది కింగ్ చర్చి, సెయింట్ ఆల్బర్ట్ లోకల్ చర్చి మరియు టేయాంగ్ స్థానిక చర్చితో సహా కొంతమంది విచారణ సభ్యులు, సంస్థలు మరియు వివిధ వాణిజ్య కేంద్రాలు ఈ పిపిసి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్థికంగా సహకరించాయి.

Add new comment

13 + 0 =