52 అడుగుల యేసు తిరుహృదయ స్వరూపం ప్రతిష్ఠోత్సవం

ఖమ్మం మేత్రాసనం, తనికెళ్ళ విచారణ,పునీత సెశీలియమ్మ గారి దేవాలయము నందు 22 నవంబర్,2021 న 52 అడుగుల యేసు తిరుహృదయ స్వరూపం ఖమ్మం పీఠకాపరి మహా ఘన మైపన్ పాల్ తండ్రిగారు, విజయవాడ పీఠాధిపతులు తెలగతోటి రాజారావు తండ్రిగారు మరియు ఏలూరు పీఠాధిపతులు పొలిమెర జయరావు తండ్రిగారిచే ప్రతిష్టించడం జరిగింది.

ఈ స్వరూపం నిర్మాణానికి ఆర్థిక సహాయమందించిన విశ్వాసులకు, స్వరూప ప్రతిష్ఠకు విచ్చేసిన ప్రియతమ మేత్రానులుకు, గురువులకు, మఠవాసులకు మరియు విచారణ విశ్వాసులకు ఆ విచారణ గురువైన గురుశ్రీ  కాకుమాను రాజు గారు ధన్యవాదాలు తెలియజేశారు.

తనికెళ్ళ విచారణ దైవ ఆశీస్సులతో ప్రతిదినం అభివృద్ధి చెందాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నాము.

Add new comment

1 + 2 =