2020 లో ఫ్రాన్సిస్ పాపు గారు సందర్శించబోవు దేశాలు.

2020 pope trips2020 pope trips

2020 లో పాపు సందర్శించబోవు దేశాలు.

2020 సంవత్సరంలో ఫ్రాన్సిస్ పాపు గారు ఎనిమిది దేశాలను సందర్శించాలని ఆసక్తి చూపించారని వాటికన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వాటిలో మోంటెనెగ్రో అనే దేశం ఒకటి. ఈ దేశాన్ని సందర్శిస్తున్న మొట్టమొదటి పాపుగారు, ఫ్రాన్సిస్ పాపు గారు. ఇదే సందర్శనలో, 16 వ బెనెడిక్ట్ పాపు గారు 2010 లో సందర్శించిన సైప్రస్ దీవిని కూడా  ఫ్రాన్సిస్ పాపు గారు సందర్శిస్తారు.

ఇరాక్ మరియు దక్షిణ సుడాన్ దేశాలను సందర్శించాలని ఉందని పాపు గారు కొన్నాళ్ల క్రితం ప్రజలకు తన సందేశం లో వ్యక్తపరిచారు. ఇరాక్ లో జరగుతున్న అల్లర్లలో చనిపోయిన వందల మందిని, గాయపడ్డ వేల మందిని, ఆయన తన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్ లో దక్షిణ సుడాన్ నుండి వాటికన్ సందర్శించిన ఆ  దేశ ప్రతినిధుల పాదాలను పాపు గారు ముద్దు పెట్టుకొని కాథోలిక విశ్వాసాన్ని, ప్రేమను చాటిచెప్పిన విషయం మనకు విదితమే. అనంతరం 2019 నవంబర్ లో దక్షిణ సుడాన్ ను 2020 మార్చ్ లో సందర్శించనున్నట్లు పాపు గారు ప్రకటించారు.

పాపు గారికి హుంగేరీ దేశానికి ఆహ్వానం వచ్చిందని, అక్కడ కార్డినల్  జోజ్సెఫ్  మిండ్సజంటే ను పునీతుని గా ప్రకటించే అవకాశం ఉందని వాటికన్ ప్రతినిధి అన్నారు.

అదేవిధంగా ఇండోనేషియా, తూర్పు తిమోర్ మరియు గునియా దేశాలను పాపుగారు సందర్శించే సూచనలు ఉన్నాయని ఆయన చెప్పారు.

Add new comment

11 + 1 =