14 జులై 2022 న ప్రారంభమైన కార్మెల్ మాత శతవార్షికోత్సవ వేడుకలు 

కార్మెల్ మాతకార్మెల్ మాత శతవార్షికోత్సవ వేడుకలు

ఫిరంగిపురం లోని కార్మెల్ మాత దేవాలయం శతవార్షికోత్సవ వేడుకలు 14 జులై 2022 న ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఉదయం 6 గంటలకు ఫిరంగిపురం విచారణ గురువులు గురుశ్రీ పామిశెట్టి బాలస్వామి గారు మరియు పొన్నెకల్లు విచారణ గురువులు గురుశ్రీ పామిశెట్టి తోమాస్ గారు సమిష్టిగా దివ్యబలిపూజను అర్పించి వేడుకలను ప్రారంభించారు.

ఫిరంగిపురం కార్మెల్ మాత దేవాలయం ఈ సంవత్సరం వంద సంవత్సరాల వేడుకలను జరుపుకుంటుంది. 130 సంవత్సరాల క్రితం ఫిరంగిపురం వచ్చిన మిల్ హిల్ గురువులు ఫిరంగిపురంలో బాలయేసు దేవాలయాన్ని నిర్మించారు. అనంతరం కార్మెల్ మాత ప్రేరణతో పక్కనే ఉన్న కొండపై కార్మెల్ మాత దేవాలయం నిర్మితమైంది. ఈ దేవాలయాన్ని నిర్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. 

ఈ వంద సంవత్సరాలలో ఎందరో విశ్వాసులు ఆ కార్మెల్ మాత వేడుదల ద్వారా ఆ దేవుని దీవెనలు మరియు ఆశీర్వాదాలు పొందారు.

జులై 14,15,16 తారీకులలో జరిగే ఈ వేడుకలకు విశ్వాసులందరిని ఫిరంగిపురం విచారణ గురువులు గురుశ్రీ పామిశెట్టి బాలస్వామి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.

Add new comment

2 + 0 =