హొంగ్ కాంగ్ ప్రోపగాండా ఫైడ్ వెబినార్ కు ఆహ్వానం

చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్‌లో జేసుసభ గురువుల ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఫర్ కాథలిక్ స్టడీస్ వారు  తమ 400వ వార్షికోత్సవ సందర్బంగా ప్రోపగాండా ఫైడ్ పై చర్చా సమావేశాలను ఆగస్టు 24-26 తేదీలలో జరపనున్నారు. 
 
ప్రధాన పరిచారకుడిగా కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే గారు సమావేశానికి ప్రధాన పరిచారకుడిగా ఉన్నారు. 
ఆసక్తి ఉన్న ఎవరైనా జూమ్ ద్వారా పాల్గొనడానికి నమోదు చేసుకోవాలని కోరారు. వెబినార్ సమయం సాయంత్రం 3:00–7:45 (హాంకాంగ్ సమయం) గంటలవరకు ఆంగ్లంలో నిర్వహించబడుతుంది. 
 
ప్రోపగాండా ఫైడ్, జనవరి 6, 1622న 15వ గ్రెగొరీ పాపు గారిచే స్థాపించబడింది. దీని స్థాపన, స్పెయిన్ మరియు పోర్చుగల్ వంటి రాష్ట్రాల ద్వారా కాకుండా ఫార్ ఈస్ట్‌లోని మేత్రాసనాలను నేరుగా పరిపాలించడానికి హోలీ సీని అనుమతించింది. దీని ప్రాముఖ్యత సువార్తీకరణ, కమ్యూనికేషన్, సైన్స్ మరియు సాంస్కృతిక మార్పిడి రంగాలపై విస్తరించింది.1967లో, ప్రోపగాండా ఫైడ్ పేరును ప్రజల సువార్తీకరణ సంఘంగా మార్చారు.
 
ఈ ముఖ్యమైన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్‌లో సెంటర్ ఫర్ కాథలిక్ స్టడీస్,  పండితుల మధ్య విద్యాపరమైన మార్పిడి వేదికగా, ఈ కీలకమైన ప్రభావాలను అధ్యయనం చేయడానికి మకావు రిక్కీ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి అంతర్జాతీయ సింపోజియంను (చర్చా సమావేశాన్ని)నిర్వహిస్తోంది.
 
Article by
K.Chandana Pramada
RVA Telugu Service

Add new comment

3 + 4 =