హైదరాబాద్ అగ్రపీఠంలో ఉచిత మెగా వైద్యశిబిరం

హైదరాబాద్ అగ్రపీఠం, యంజాల, కమ్మగూడ పునీత జోసఫ్ ఆసుపత్రి యందు 20 ఆగస్టు,2022, ఉ॥ 9 గం.ల నుండి మ॥ 2 వరకు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ అతిమేత్రాసన సామాజిక సేవా సంఘం వారి సహకారంతో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం మరియు పునీత జోసఫ్ ఆసుపత్రి వారు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు HASSS డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని గారు RVA తెలుగు విభాగం వారికి తెలిపారు.

ఈ శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, కంటి పరీక్ష, దంత పరీక్ష, X - Ray,  ఆరోగ్య పరీక్ష (స్కానింగ్), రక్తపోటు పరీక్ష వంటివి నిర్వహించనున్నారని, పరీక్షల నివేదికను బట్టి ఉచిత మందులు మరియు కళ్లద్దాలు అందచేస్తామని తెలియచేసారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా HASSS వారు కోరుకుంటున్నారు.
 

Add new comment

4 + 2 =