హృదయ ఉద్దిష్టాలను తప్పనిసరిగా ఎరిగి ఉండాలి : ఫ్రాన్సిస్ పాపు గారు

It's necessary to look at the heart's intentionsIt's necessary to look at the heart's intentions

హృదయ ఉద్దిష్టాలను తప్పనిసరిగా ఎరిగి ఉండాలి : ఫ్రాన్సిస్ పాపు గారు

అక్టోబర్ 16 , 2019 న ఫ్రాన్సిస్ పాపు గారు తన సందేశంలో, ఏ విధంగా అపొస్తలులు యూదులకే కాక ఇతరులకు కూడా సువార్తను బోధించడం ద్వారా క్రైస్తవ సమాజం యొక్క భవిష్యత్తును మార్చారో ధ్యానించారు. 

మనిషి యొక్క పుట్టుక, వంశాలను బట్టి కాక హృదయాన్ని బట్టి అతని స్వచ్ఛతను నిర్ణయించాలని క్రైస్తవ సమాజం గ్రహించినదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని పాపు గారు వివరించారు.

"హృదయ ఉద్దిష్టాలను తప్పనిసరిగా ఎరిగి ఉండాలి, ఎందుకంటే మలినానికి బీజం హృదయాంతరాలలోనే పడుతుంది." అని ఆయన ప్రభోదించారు.

ఇది ఆదిమ క్రైస్తవ సంఘంలో అన్య మతస్తులకు పేతురు గారు బోధించునప్పుడు ఆయన పై వచ్చిన వ్యతిరేకతను కూడా ఆయన లెక్కించలేదు అను ప్రాధమిక సత్యాన్ని మనకు విశిధపరుస్తుందని పాపు గారు చెప్పారు.

"పేతురు గారికి యూదులకు మధ్య ఉన్న సంబంధాలను గూర్చి క్రైస్తవ సమాజంలో పుకార్లు పుడుతున్న సమయంలో పేతురుగారు నిరాశ చెందలేదు. ఆయనకు తెలుసు ఆపోస్టులునిగా ఉండడమంటే బహుమతి కాదు, అది మధ్యవర్తిత్వానికి పిలుపు, దేవునికి మానవాళికి మధ్య ఒక వంతెన"అని పాపు గారు సందేశం ఇచ్చారు.

జేవియర్ రోమేరో 
అనువాదకర్త: అరవింద్ బండి

 

Add new comment

1 + 0 =