హింస ప్రజాస్వామ్యాన్ని చంపుతుంది

హింస ప్రజాస్వామ్యాన్ని చంపుతుంది

హింస ప్రజాస్వామ్యాన్ని చంపుతుంది. హింస స్వేచ్ఛను చంపుతుంది. హింస న్యాయాన్ని చంపుతుంది. రాజకీయ అభిప్రాయ భేదాలను స్వేచ్ఛగా చర్చలు మరియు ఓటు ద్వారా పరిష్కరించుకోవాలి. న్యాయం మరియు శాంతిని నెలకొల్పడానికి సంభాషణ మాత్రమే నిజమైన పరిష్కారాన్ని అందిస్తుంది" అని  టోక్యో ఆర్చ్ బిషప్ (అగ్రపీఠాధిపతులు) టార్సిసియస్ ఇసావో కికుచి గారు  RVA న్యూస్‌తో అన్నారు.

టోక్యో ఆర్చ్ బిషప్ టార్సిసియస్ ఇసావో కికుచి గారు  మాట్లాడుతూ "జపాన్ మాజీ ప్రధాని మిస్టర్. షింజో అబేపై జరిగిన దాడి వార్త విని నేను చాలా బాధపడ్డాను మరియు దిగ్భ్రాంతికి గురయ్యాను అని తెలిపారు. మరియు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

దుండగుడు జరిపిన కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.  జపాన్‌ పార్లమెంట్‌ ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిమిత్తం శుక్రవారం (జులై 8) ఉదయం వెస్టరన్ జపాన్ లో నగరంలోని ఓ కూడలి వద్ద లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా షింజో అబేపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఆయన వెనుక వైపు నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు సార్లు కాల్పలు జరపడంతో షింజో అబె తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల్లో తీవ్ర గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2006-2007 నుండి 2012-2020 వరకు రెండుసార్లు పనిచేసిన షింజో అబే జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియమైన స్నేహితులలో షింజో ఒకరు అని పేర్కొన్నారు. అబే మరణం తనకు బాధ కలిగించిందన్నారు.

 

 

 

 

Add new comment

1 + 13 =