స్వాతంత్య్ర దినోత్సవం

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి.

స్వాతంత్య్ర ఉద్యమం లో  మొట్టమొదట చెప్పుకోవాల్సింది 1857 సిపాయిల తిరుగుబాటు. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపె, బహదూర్ షా జఫర్, నానా సాహెబ్ మొదలగువారు పోరాటాలు చేశారు.
ఈ పోరాటమే స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిపోసింది. 19వ శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, మన దేశ పోరాట పటిమను చూసి బ్రిటీష్ వారు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్లు ప్రకటించారు.

 

 

 

Add new comment

8 + 9 =