స్త్రీ సాధికారతకు SIGNIS సదస్సు

నేటి ప్రపంచంలో మహిళలు సాధికారత సాధించాలని అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని హైదరాబాద్ అగ్రపీఠంలో SIGNIS వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 22,2021న, HASSSలో గురుశ్రీ ఇన్నారెడ్డి (హైదరాబాద్ సిగ్నిస్ కోఆర్డినేటర్), యం.డి .విన్సెన్ట్ గారు   (సిగ్నిస్ మెంబెర్), హన్స్ డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

ముఖ్య అతిధిగా హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మహా ఘన.పూల అంతోని వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలము చేసి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. అదేవిదంగా అమృతవాణి డైరెక్టర్ మరియు రీజినల్ SIGNIS జనరల్ సెక్రటరీ అయిన గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు,  అగ్ర మేత్రాసన ప్రొక్యూరేటర్ గురుశ్రీ విక్టర్ ఇమ్మానుయేల్ వీరు ఇరువురు  కూడా జ్యోతిప్రజ్వలము చేసారు.
సిస్టర్ మంజు గారి ప్రార్థనతో  ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రమారమి 200 మంది యువతీ యువకులు మరియు మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యం.డి .విన్సెన్ట్ గారికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి అభినందనలు.

 

Add new comment

2 + 18 =