స్కూల్‌పై దాడి

క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి

మధ్యప్రదేశ్‌లోని విదీశ జిల్లా గంజ్ బసోడా పట్టణంలో మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాథలిక్  సెయింట్ జోసెఫ్ స్కూల్‌ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు స్థానికులతో కలిసి పాఠశాలపై దాడిచేసి, బీభత్సం సృష్టించారు. స్కూల్‌లో విద్యార్థులను క్రైస్తవంలో మార్చినట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో దాడికి పాల్పడ్డారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాలకు వద్దకు వందలాదిగా చేరుకుని, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్‌పై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు, సిబ్బంది  భయంతో పరుగులు తీశారు.

 

Add new comment

7 + 12 =