సేలం పీఠానికి నూతన పీఠాధిపతి

new archbishopగురుశ్రీ అరుళ్ సెల్వం రాయప్పన్

సేలం పీఠానికి నూతన పీఠాధిపతి

తమిళనాడు లోని సేలం పీఠానికి నూతన పీఠాధిపతిగా గురుశ్రీ అరుళ్ సెల్వం రాయప్పన్ గారు నియమితులయ్యారు. ఈ మేరకు వాటికన్ నుండి ఉత్తర్వులు జారీ అయినట్లు భారతదేశ నూన్సియో కార్యాలయం నుండి సమాచారం అందింది. 

18 నవంబర్ 1960 లో సతిపత్తు అనే గ్రామంలో జన్మించిన గురుశ్రీ అరుళ్ సెల్వం రాయప్పన్ గారు 20 మే 1986 న గురువు గా అభిషిక్తులయ్యారు. అనంతరం ఆయన రోము నగరంలో  ఉన్నతవిద్యను అభ్యసించి, ఎన్నో డిగ్రీలు కూడా సాధించారు. 1994 నుండి ఆయన బెంగళూరు లోని సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ లో బైబిల్ చట్టానికి సంబంధించిన అధ్యాపకునిగా పని చేస్తూ ఇప్పుడు అదే విద్యాలయానికి డైరెక్టర్ గా వ్యహరిస్తున్నారు.

గురుశ్రీ అరుళ్ సెల్వం రాయప్పన్ గారు పీఠాధిపతిగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలను దైవ మార్గంలో మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు వారు అందిస్తున్న శుభాకాంక్షలు.

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

12 + 7 =