సెల్యూట్

సెల్యూట్

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శివార్లు అడవి కొత్తూరు గ్రామ సమీపంలో ఓ పెద్దాయన  లోతైన గుంతలో చనిపోయాయి ఉన్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు వెళ్లారు. ఆ చనిపోయిన ఆ వ్యక్తిని  తీసేందుకు పోలీసులకు అక్కడవారు ఎవరూ  సహాయం చేయలేదు. పోలీసులు అక్కడికి వచ్చినా పొలాల్లో నుంచి మృతదేహం బయటికి తీసుకురావడం కష్టం గా మారింది. స్ధానికంగా పొలాల్లో నుంచి మృతదేహం బయటికి తెచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా లేదు.

ఎవర్ని అడిగిన  చేసినా ప్రయోజనం లేదని భావించిన కాశీబుగ్గ ఎస్సై శిరీష రంగంలోకి దిగారు. చనిపోయిన వ్యక్తిని బయటకు తీసి సుమారు కిలోమీటరు  స్ట్రెచ్చర్‌పై వేసుకొని అంబులెన్స్ వరకు తీసుకెళ్లారు. చనిపోయిన వ్యక్తిని మోసుకెళ్తున్న ఎస్సై శిరీష ఫొటోస్,వీడియోస్ సోషల్ మీడియా లో  వైరల్‌ అయ్యాయి. పొలాల్లో గట్లు దాటుకొని చనిపోయిన వ్యక్తిని ఆమె మోసుకువచ్చారు. శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీషపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శిరీష మానవత్వంపై డీజీపీ గౌతం సవాంగ్‌ అభినందిస్తూ ఓ సందేశం పెట్టారు.

Add new comment

6 + 4 =