సెయింట్ థామస్ సిరో మలబార్ ఎపార్కీ కి నూతన పీఠాధిపతి

సెయింట్ థామస్ సిరో మలబార్ ఎపార్కీ మహా పూజ్య మార్ జాయ్ అలప్పట్

 

సెయింట్ థామస్ సిరో మలబార్ ఎపార్కీ కి నూతన పీఠాధిపతిగా నియమించబడ్డ మార్ జాయ్ అలప్పట్ 

అమెరికా దేశంలోని చికాగోలో సెయింట్ థామస్ సిరో మలబార్ ఎపార్కీ కి నూతన పీఠాధిపతిగా మహా పూజ్య మార్ జాయ్ అలప్పట్ గారు నియమితులయ్యారు.

మార్ జాయ్ అలప్పట్ గారు సెయింట్ థామస్ సిరో-మలబార్ ఎపార్కీ కి నియమింపబడ్డ రెండవ పీఠాధిపతి. ఈ మేరకు ఫ్రాన్సిస్ పాపు గారు అధికారికంగా ఒక ప్రకటనను 03 జులై 2022 న విడుదల చేసారు. ఈ వార్తను భారతదేశానికి అపోస్టోలిక్  నున్షియో అయిన అగ్రపీఠాధిపతి మహా పూజ్య. లియోపోల్డో గిరెల్లి సిరో-మలబార్ చర్చి మేజర్ అగ్రపీఠాధిపతి కార్డినల్ మార్ జార్జ్ అలెంచెరీకి తెలియజేశారు. అలప్పట్ గారు చికాగోలోని సిరో-మలబార్ ఎపార్కీకి సహాయక పీఠాధిపతిగా సేవలందిస్తున్నారు. 

మార్ జాయ్ అలప్పట్ గారు సెప్టెంబరు 27, 1956న భారతదేశంలోని కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని పరప్పుకరలో జన్మించాడు. ఆయన తన ఉన్నత పాఠశాల తర్వాత సెయింట్ మేరీస్ మైనర్ సెమినరీ, థోపే, త్రిస్సూర్‌లో చేరారు. అనంతరం సెయింట్ థామస్ అపోస్టోలిక్ సెమినరీ, వడవత్తూర్, కొట్టాయంలో తన ప్రధాన సెమినరీని పూర్తి చేసారు. డిసెంబర్ 31, 1981 న ఇరింజలకుడ మేత్రాసనంలో గురువుగా నియమితులయ్యారు.
 

Add new comment

1 + 0 =