సూర్యాపేట విచారణలో నిర్మలమాత దేవాలయ వార్షికోత్సవాలు

సూర్యాపేట విచారణనిర్మలమాత దేవాలయ వార్షికోత్సవ మహోత్సవములు

నల్గొండ మేత్రాసనం, సూర్యాపేట విచారణ నందు నిర్మలమాత దేవాలయ వార్షికోత్సవ మహోత్సవములు 6 జూన్ 2022న ఘనంగా జరిగాయి. పవిత్రాత్మ సభ వ్యస్థాపకులు గురుశ్రీ క్రీస్తురాజు గారు సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. క్రీస్తులో నమ్మకము, ఆయనతో విశ్వాసంలో ఎలా జీవించాలనే అంశంతో గురుశ్రీ క్రీస్తు రాజు గారు ప్రసంగించారు. మహోత్సవాలలో భాగంగా వంగమర్తి గురువులు గురుశ్రీ కస్పారెడ్డి గారి రజతోత్సవ జూబిలీ మరియు సూర్యాపేట విచారణలో పునీత అన్నమ్మ గారి సభ సుపీరియర్ సిస్టర్ మారంరెడ్డి థెరిస్సా గారి స్వర్ణ జూబిలీ వేడుకలు జరుపుకున్న వీరిని విచారణ కౌన్సిల్ సభ్యులు సన్మానించారు. గురుశ్రీ బొయిండ్ల రాజు, ముప్పాళ్ల కరుణాకర్, ఛాతిరి అరుణ్ కుమార్,  గురుశ్రీ బెంజమిన్, గురుశ్రీ బోస్కో, గురుశ్రీ కస్పారెడ్డి, గురుశ్రీ ఇన్నారెడ్డి, గురుశ్రీ కుమార్ గార్లు, పునీత అన్నమ్మ గారి సభ మఠకన్యలు, నిర్మల సభ మఠకన్యలు, మునగాల, అనాజిపురం, బాలెంల, వంగమర్తి, వల్లభపురం, ముకుందాపురం గ్రామాల నుంచి విశ్వాసులు మహోత్సవంలో పాల్గొన్నారు. కోకా జోసఫ్ రంజిత్ గారి ఆధ్వర్యంలో నిర్మలమాత దేవాలయ విచారణ గాయక బృందం పండుగ దివ్యబలిపూజ గీతాలను మధురంగా ఆలపించారు. సాయంత్రం  కోలాట ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, సూర్యాపేట పురవీధులలో నిర్మలమాత తేరు ప్రదక్షిణతో భక్తిగీతాలు మరియు జపమాలను జపించారు. విచారణ కర్తలు గురుశ్రీ పసల మరియన్న గారు పండుగ పూజకు విచ్చేసిన గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, విచారణ ప్రజలకు, సంఘపెద్దలకు, దాతలకు, నిర్మలమాత దేవాలయ వార్షికోత్సవ పండుగ విజయవంతం కావడానికి సహాయ సహకారాలందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సూర్యాపేట విచారణను, విచారణ విశ్వాసులను ఆ మరియతల్లి ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడి ప్రార్ధించాలని  అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.  

 

Add new comment

12 + 5 =