
సూర్యాపేటలో ఘనంగా జరిగిన నిర్మలమాత మహోత్సవాలు
సూర్యాపేటలోని నిర్మల మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు జనవరి 29 మరియు 30 తారీకులలో ఘనంగా జరిగాయి.
జనవరి 22 నుండి నవదిన ప్రార్ధనలు ప్రారంభం కాగా, 29 మరియు 30 తారీకులలో ఉత్సవాలు జరిగాయి.

ఈ నవదిన ప్రార్థనలలో పలువురు గురువులు మరియమాత సుగుణాలను గూర్చి, ఆ తల్లి మహత్యమును గూర్చి విశ్వాసులకు ప్రసంగించారు. జనవరి 29 న ఉదయం 9 గంటల నుండి స్వస్థతా ప్రార్ధనలు, పాపసంకీర్తనాలు, దివ్యబలిపూజ జరిగాయి.
మహోత్సవం చివరి రోజైన జనవరి 30 న ఉదయం 9 : 30 గంటలకు పండుగ దివ్యబలిపూజను గురుశ్రీ సిరిల్ గారు మరియు ఇతర గురువులు అర్పించారు.
సాయంత్రం 4 గంటలకు వత్తుల సమర్పణ జరిగింది. అనంతరం జరిగిన కూలత ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.
సాయంత్రం 4 : 30 గంటలకు సూర్యాపేట పురవీధులలో నిర్మలమాత తేరు ప్రదక్షిణ జరిగింది. రాత్రి 7 గంటలకు జరిగిన దివ్యసత్ప్రసాద ఆశీర్వాదంతో మహోత్సవాలు ముగిసాయిలు.

ఈ మహోత్సవాలకు విచ్చేసి ఆ మరియతల్లి ఆశీర్వాదాలు పొందిన విశ్వాసులందరికి సూర్యాపేట విచారణ గురువులు గురుశ్రీ పసల మరియన్న గారు కృతఙ్ఞతలు తెలిపారు.
Add new comment